Site icon NTV Telugu

RTC MD Sajjanar: అద్దె బస్సుల యజమానులతో ముగిసిన భేటీ.. సజ్జనార్ ఏమన్నారంటే..?

Rtc Md Sajjanar

Rtc Md Sajjanar

RTC MD Sajjanar: అద్దె బస్సుల యజమానులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. నేడు బస్‌భవన్‌లో అద్దె బస్సుల యజమానులతో సమావేశమైన అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. వారు కొన్ని సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు. అద్దె బస్సుల యజమానుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తామని చెప్పారు. రేపటి నుంచి సమ్మె లేదని, అద్దె బస్సులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి ఉచిత బస్సు సర్వీసు ఉంటుందని, సంక్రాంతికి ప్రత్యేక బస్సులు కూడా నడుపుతామని సజ్జనార్ పేర్కొన్నారు.

Read also: Kunamneni: పార్లమెంట్ లో ఒక సీటు ఇవ్వండి.. కాంగ్రెస్ ని కోరిన సీపీఐ

కాగా, అంతకుముందు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను అద్దె బస్సుల యజమానుల సంఘం నేతలు కలిశారు. సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. “హైర్ బస్సు యాజమానులు కొన్ని అంశాలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. మహాలక్ష్మి స్కీం అమలు తర్వాత ఇబ్బందులు గురవుతున్నామని చెప్పారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి ఈ రోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రభుత్వం స్పందించకుంటే రేపటి నుంచి బస్సులు నడుపుతామని స్పష్టం చేశారు. ఆర్టీసీ అద్దె బస్సుల సంఘం రేపటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిందని తెలిపారు. ఆర్టీసీ లో మొత్తం 2700 అద్దె బస్సులు రాష్ట్రమంతా నడుపుతున్నారని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే రేపటి నుంచి 2700 బస్సులను రోడ్ ఎక్కేది లేదంటున్న యజమానులు అన్నారు. పొన్నంతో కలిసిన అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో హైర్ బస్సుల యజమానులు భేటీ అయ్యారు. అనంతరం అద్దె బస్సు ఓనర్ల తో చర్చలు సఫలమయ్యాయని టీ ఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జ నార్ వెల్లడించారు. రేపటి నుంచి యధావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని క్లారిటీ ఇచ్చారు. ప్రయాణికులు భయపడాల్సిన పనిలేదని, బస్సులు యదావిధిగా నడుస్తాయని సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు.
T20 World Cup 2024: భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్ అప్పుడేనా?

Exit mobile version