హన్మకొండలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. 80 మంది ప్రయాణికులతో బస్సు రన్నీంగ్‌లో ఉండగా బస్సు టైర్ ఊడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కరీంనగర్-వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై ఆదివారం హుజరాబాద్ నుండి హనుమకొండ వైపు పల్లె వెలుగు బస్సు బయలుదేరింది.
Also Read: Bihar: “తల్లిని మించిన యోధులు లేరు”.. ప్రాణాలను అడ్డుపెట్టి పిల్లల్ని రక్షించింది.. వీడియో వైరల్..
ఈ నేపథ్యంలో హన్మకొండ ఎల్కతుర్తి సమీపంలో బస్సు వెనక టైరు ఊడిపోయింది. దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించిన బస్సు ప్రమాదం భారీన పడకుండ చూశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉండగా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు. అయితే ఓవర్ లోడ్ కారణంగా బస్సు టైర్ ఊడిపోయినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.