Site icon NTV Telugu

RS Praveen Kumar: అసైన్డ్ భూములలో ఎవరి ఫామ్ హౌస్ లు ఉన్నాయో బయట పెట్టాలి..!

Rs Praveen Kumar

Rs Praveen Kumar

RS Praveen Kumar: అసైన్డ్ భూములలో ఎవరి ఫామ్ హౌస్ లు ఉన్నాయో బయట పెట్టాలని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లకిడికపూల్ బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ధరణి పోర్టల్, అసైన్డ్ భూముల అన్యక్రాంతంపై ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. అనంతరం ఎన్నికల ప్రచారం పోస్టర్ ను ఆవిష్కరించారు. బహుజన యాత్రలో ఉండడం వలన ఇన్ని రోజులు హైదారాబాద్ కు రాలేక పోయామని అన్నారు. జనాలలో తిరిగినప్పుడు జనాలు చెప్పిన కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకు వస్తానని అన్నారు. భారీ వర్షాలతో జనాలు తీవ్రంగా నష్ట పోయారని, నష్ట పోయిన వారికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోరంచ పల్లి, కొండాయి గ్రామం కు వంద కోట్లు ఇవ్వాలని అన్నారు.

హైదారాబాద్ బడా బాబుల కోసం కేబుల్ బ్రిడ్జిలు కడుతున్నారని, చాలా గ్రామాల్లో ఉన్న వాగులకు బ్రిడ్జిలు కట్టడం లేదని మండిపడ్డారు. చనిపోయిన వారంతా వాగులు దాటుతూ చనిపోయిన వారే అని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ప్రభుత్వ, అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజు కుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 వేల ఎకరాలు పేద ప్రజల దగ్గర నుండి గుంజు కుని బడా బాబులకు ఇస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో బహుజన వాదం బలపడడంతో కేసీఆర్కె తట్టుకోలేక పోతున్నారని అన్నారు. అందుకే భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ ను అంబేడ్కర్ మనుమడిని తీసుకు వచ్చి బహుజన వాదిని అని కేసీఆర్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత.. బహుజనుల దగ్గర నుండి ప్రభుత్వం గుంజుకున్న అసైన్డ్ భూములను మళ్ళీ రైతులకు పంచుతామని అన్నారు.

Read also: Chandramukhi 2: చంద్రముఖి 2 నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్.. అదిరిపోలా!

అసైన్డ్ భూముల హక్కుల కోసం పోరాటం చేస్తున్న బీఎస్పీ నాయకులపై పెట్టిన కేస్ లను ఎత్తివేయాలని, కేస్ లకు మేము భయ పడమని తెలిపారు. రైతుల దగ్గర భూములను గుంజుకుని బడా బాబులకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. గత ప్రభుత్వాలు కూడా పేదలకు బిస్కెట్లు వేసి వేల కోట్ల భూములు కాజేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులతో అధికారులు సెటిల్ మెంట్ చేసుకొని ఎకరాల భూములు తీసుకొని, ఐదు, ఆరు వందల గజాలు ఇచ్చి మిగిలిన భూములు ప్రైవేటు వ్యక్తులకు కోట్ల రూపాయలకు అప్పగిస్తున్నారని అన్నారు. అసైన్డ్ భూములు లే అవుట్ చేసుకోమని ఏ చట్టం చెబుతోంది? అంటూ ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన రెండు మూడు వందల గజాలలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదని తెలిపారు.

బహుజన రాజ్యంలో రైతులకు ఆ భూములు తిరిగి ఇస్తామన్నారు. పేదల నోట్లో మట్టి కొట్టి వారి ఆస్తులు గుంజుకొని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకొని కోట్లు గడిస్తున్నారని తెలిపారు. ఇందులో కేటీఆర్ హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసైన్డ్ భూములలో ఎవరి ఫామ్ హౌస్ లు ఉన్నాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కోర్టు కు సైతం వెళ్తాం..న్యాయ పోరాటం చేస్తామన్నారు. అన్యాక్రాంతం భూములు ప్రభుత్వం గుంజుకుంది ప్రభుత్వం మీద పిల్ వేస్తామన్నారు. అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలు చేసేవారికి దయచేసి వేలం వేయడం ఆపేయాలని హెచ్చరించారు. వేలం వేసిన భూములు లాక్కొని పేద ప్రజలకు తప్పక ఇస్తామన్నారు. ఈ భూముల కోసం ఎంతటి పోరాటానికైనా బీఎస్పీ సిద్దంగా ఉందని అన్నారు.

బడంగ్ పేట భూములు 40 ఎకరాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తన అనుచరులు ఆక్రమణ చేస్తుంటే అడ్డుకున్న వారి మీద దాడులు చేసి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూములు దున్నుకుంటున్న రైతులకు చాలా రాష్ట్రాల్లో రెగ్యులర్ ఏజ్ చేసి పట్టాలు ఇస్తున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రం లో కూడా అసైన్డ్ భూములకు రెగ్యులర్ ఏజ్ చేసి పట్టాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూములను వాళ్ళ పార్టీ ఆఫీస్ లకు ఇస్తున్నారని తెలిపారు. అసైన్డ్ భూములను ప్రయివేట్ వ్యక్తులకు ఇచ్చిన వాటిపై విచారణ జరిపించాలని.. లేకపోతే మేము కోర్టుకు వెలుతామన్నారు. పంచాయతీ కార్మికుల సమస్యల మీద కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బుద్వెల్ లో ప్రభుత్వ భూములను హెచ్ఎండిఏకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మని అన్నారు. ఓటు మాకు అధికారం మీకు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.
Shama Sikander Hot Pics: స్విమ్మింగ్ పూల్‌లో షామా సికిందర్.. తడిసిన అందాలతో తాపం పెంచుతోందిగా!

Exit mobile version