NTV Telugu Site icon

నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం: ఆర్ఎస్ ప్రవీణ్

బహుజనుల బతుకులు మారాలంటే వంద శాతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. బహుజనులు కేంద్రంగా కొత్త పార్టీ రావాలన్నారు. తెలంగాణలో బహుజనులకు న్యాయం జరగలేదు, సంపద అంతా ఒక్క శాతం మంది దగ్గర ఉందని, 99 శాతం మందికి తాయీలాలతో నడిపిస్తున్నారన్నారు. ‘దళిత బంధు’ చర్చలకు నాకు ఆహ్వానం లేదు అని తెలిపారు. రాజకీయాల్లోకి రావడం ఖాయం అని తేల్చేశారు. ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఆరేళ్ళ పాటు సమయం వృధా కావొద్దనే బయటికి వచ్చానన్నారు. గురుకులాల్లో అక్రమాలకు తావులేదు, తప్పు చేస్తే ఉరికంభం ఎక్కడానికి సిద్దమని మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.