RS Praveen Kumar: బీఆర్ఎస్-బీఎస్పీ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేసీఆర్, ఆర్ ప్రవీణ్ కుమార్ మధ్య పొత్తుపై ఇప్పటికే ఈ రెండు పార్టీల నేతలు చర్చలు జరిగాయి. తాజాగా బీఎస్పీకి సీట్లు కేటాయిస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పొత్తులో భాగంగా 15 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్.. బీఎస్పీకి రెండు స్థానాలు కేటాయించింది. హైదరాబాద్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (ఆర్ఎస్పీ) నాగర్ కర్నూల్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే దానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, 17 లోక్‌సభ స్థానాల్లో 11 స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా ఇప్పటి వరకు ఖరారైంది.
Read also: Electoral bonds: పొలిటికల్ పార్టీలకు రూ.1,368 కోట్లు ఇచ్చిన ‘లాటరీ కింగ్’ ఎవరు?
పొత్తులో భాగంగా ఇటీవల నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలను బీఎస్పీకి కేటాయించడంతో బీఆర్ ఎస్ మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థులను ప్రకటించే నియోజకవర్గాల జాబితాలో సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి, మెదక్ ఉన్నాయి. కాంగ్రెస్ జాబితా వెలువడిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ పై కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గంలో ఈ నెల 23న బీఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అభ్యర్థులను ఖరారు చేసిన ప్రచార షెడ్యూల్‌లో బహిరంగ సభలు, స్థానిక సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే నేతలను కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.
Supreme Court: ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ..