ఈ నెల 8వ తేదీన నల్గొండ జిల్లాలో జరిగే సభ చరిత్ర సృష్టిస్తుందన్నారు మాజీ ఐఏఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ నెల 8న ఆయన బీఎస్పీలో చేరనున్న సందర్భంగా నార్కట్ పల్లి మండలంలో ముఖ్యకార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో జరిగే సభతో చరిత్ర సృష్టించబోతున్నాం.. కుమారి మాయావతిని భారత ప్రధానిగా చేయడానికి నల్గొండలో జరిగే బహిరంగ సభ కీలకం కానుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బహుజనుకి రాజ్యాధికారం ఇవ్వడమే నా ఉదేశం.. కానీ, ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ వుండటానికి కాదని వ్యాఖ్యానించారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. మనం ఫస్ట్ రాజ్యాధికారం సపాదించుకున్నాక ఎవరెవరు ఏమీ హోదాలో ఉండాలో చూద్దామన్న ఆయన.. లేకుంటే మిగిలి వాళ్ళు వచ్చి కళ్ళు మొక్కుతారు.. ఆ స్కీమ్, ఈ స్కీమ్ అని వస్తారు అంటూ ప్రభుత్వ పథకాలపై సెటైర్లు వేశారు.. ఇక, 70 ఏళ్లుగా బహుజనులు ఆణిచివేతకి గురయ్యారు.. ఇకనైనా మేల్కోవాలని పిలుపునిచ్చారు. కాగా, వీఆర్ఎస్ తీసుకున్న సీనియర్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ నెల 8వ తేదీన బీఎస్పీలో చేరనున్నారు.. ఈ సందర్భంగా నల్గొండలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు.. పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.