NTV Telugu Site icon

Mallu Ravi: BSP లో RSP చేరింది కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే..

Mallu Ravi

Mallu Ravi

BSP లో RSP చేరింది కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే అనేది అందరికి తెలుసని కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి సంచలన వ్యాఖ్యలు చేశారు. Rs ప్రవీణ్ కుమార్.. కొల్లాపూర్, అచ్చంపేట ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని అంటున్నారని మండపడ్డారు. RS వ్యాఖ్యలు కండిస్తున్న అన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారన్నారు. Ips అధికారిగా పని చేశారని గుర్తుచేశారు. అనంతపురంలో sp గా ఉన్నప్పుడు పరిటాల రవి హత్య జరిగిందన్నారు. అప్పుడు నీ మీద చర్యలు తీసుకుందా అప్పటి ప్రభుత్వం అని ప్రశ్నించారు. శ్రీధర్ రెడ్డి హత్య వెనక ఎవరున్నారు.. ఏంటి అని విచారణ జరుగుతుందన్నారు. దోషులను పెట్టుకుంటారు పోలీసులు అన్నారు. బుల్డోజర్ తో కొల్లాపూర్ లో ఇండ్లు కూల్చుతున్నారని Rsp అంటున్నాడని, బుల్డోజర్ లకు కాంగ్రెస్ వ్యతిరేకం అన్నారు. మతిస్థిమితం లేకుండ మాట్లాడుతున్నాడు Rsp అన్నారు. Rsp దారి తప్పిన పోలీసు లెక్క మట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: KTR: గల్లిమే లూటో… ఢిల్లీకి భేజో అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు

కరీంనగర్ లో SP గా ఉన్నప్పుడు బడుగు..బలహీన వర్గాల పిల్లల్ని కాల్చి చంపిన చరిత్ర నీది అంటూ మండిపడ్డారు. కల్లోలిత ప్రాంతాలు ఎంకౌంటర్ చేసినట్టు అనుకుంటున్నవా? అని ప్రశ్నించారు. కేటీఆర్.. కేసీఆర్ వ్యూహాలను అమలు చేస్తున్నాడు Rsp అంటూ నిప్పులు చెరిగారు. Bsp లో Rsp చేరింది కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే అనేది అందరికి తెలుసన్నారు. Bsp లో ఉన్నప్పుడు కేసీఆర్ ని తిట్టి.. Brs లో చేరి కేసీఆర్ పార్టీ టికెట్ తీసుకుని పోటీ చేశారన్నారు. కేసీఆర్ చేతిలో ఆటబొమ్మ Rsp అన్నారు. రేవంత్ మీద అక్కసు వెళ్లగక్కుతున్నాడు Rsp అన్నారు. ఏ రోజైన కేసీఆర్ Mla లను..ప్రతిపక్ష నేతలను పిలిచి మాట్లాడారా..? అని ప్రశ్నించారు. అందరిని పిలిచి మాట్లాడుతున్న రేవంత్ పై విమర్శలు సరికాదన్నారు. జూన్ 4 తర్వాత నాగర్ కర్నూల్ లో సభ పెట్టి చెప్తామన్నారు. భారీ మూల్యం చెల్లించుకుంటారు మీరు అంటూ సవాల్ విసిరారు.
Remal Cyclone : రెమల్ తుఫానుకు ఆ పేరు ఎందుకు పెట్టారు..ఇంతకీ దాని అర్థం ఏమిటంటే ?