NTV Telugu Site icon

KTR: నేడు తొర్రూరుకు కేటీఆర్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సభ

Ktr

Ktr

KTR: నేడు ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు, మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో పర్యటించనున్నారు. ఉదయం బేగంపేట నుంచి మంత్రి కేటీఆర్‌ హెలికాప్టర్‌లో వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చేరుకుంటారు. ఇవాల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నేటి నుంచి 10 వరకు నిర్వహించనున్న క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ వైద్య శిబిరాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. అనంతరం జరిగే సభలో ప్రసంగిస్తారు. తర్వాత తొర్రూరులో నిర్మించిన సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మోడల్‌ మార్కెట్‌ను ప్రారంభిస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు యతిరాజారావు మెమోరియల్‌ పార్కు, ఓపెన్‌ జిమ్‌ ప్రారంభించి, మధ్యాహ్నం 3.15 గంటలకు అక్కడే ఏర్పాటు చేసే సభలో మహిళా సహాయక సంఘాలకు రూ.750 కోట్ల వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం అభయహస్తం డబ్బులను పంపిణీ చేసిన అనంతరం 20 వేల మంది మహిళలతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక సాయంత్రం 4 గంటలకు తొర్రూరు నుంచి హైదరాబాద్‌కు హెలికాప్టర్‌లో తిరిగి బయల్దేరుతారు.

read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఈ సభ ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూరులో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు బైక్ ర్యాలీ, పలు ప్రారంభోత్సవ వేడుకలను పరిశీలించారు. అనంతరం పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఏర్పాట్లపై చర్చించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి హెలిప్యాడ్, బహిరంగ సభ స్థలం, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేటీఆర్ సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Kajal Aggarwal: చందమామ నువ్వే నువ్వే.. వెన్నెలంతా నవ్వే నవ్వే