Site icon NTV Telugu

Lady constable: ప్రయాణికురాలు ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ మహిళ కానిస్టేబుల్..

Lady Conistable

Lady Conistable

ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్లలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న ట్రైన్స్ ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ప్రయాణికులు అదుపుతప్పి పడిపోవడం.. లేదా ప్లాట్‌ఫాం పై నుంచి పట్టాలపై పడిపోవడం లాంటి ఘటనలు రైల్వే స్టేషన్లలో చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు వచ్చినప్పుడు ఆ రైల్వే స్టేషన్లలో పనిచేసే పోలీసులు ప్రయాణికుల్ని రక్షించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువతిని రైలు కింద పడిపోకుండా ఓ మహిళ కానిస్టేబుల్ రక్షించింది.

Read Also: Fresh Mutton: మీరు కొంటున్న మటన్‌ తాజాదేనా.?

నిన్న (మంగళవారం) ఉదయం 9 గంటలకు లింగంపల్లి-ఫలక్‌నూమా ఎంఎంటీఎస్ రైలు బేగంపేట్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అయితే ఆ ట్రైన్ కొద్దిసేపు ఆపి ముందుకు వేగాన్ని వెళ్లింది. ఈ క్రమంలో సరస్వతి అనే ఓ ప్రయాణికురాలు ఆ కదులుతున్న రైలు ఎక్కేందుకు ట్రై చేసింది.. అదే సమయంలో అక్కడ డ్యూటీ చేస్తున్నా.. సనిత అనే రైల్వే ప్రొటెక్క్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ ఆమెను గుర్తించింది. వెంటనే పరిగెత్తుకెళ్లి ఆ ప్రయాణికురాలిని పట్టుకుని వెనక్కి లాగింది. ఒకవేళ మహిళ కానిస్టేబుల్ సనిత అక్కడికి రాకపోయి ఉంటే ఆ ప్రయాణికురాలు ( సరస్వతి ) ట్రైన్ కింద పడిపోయే ప్రమాదం ఉండేంది. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

Read Also: New Rules: జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇవి పూర్తి చేశారా లేదంటే అంతే..!

ఆ ప్రయాణికురాలిని రక్షించడంపై అధికారులు కానిస్టేబుల్ సనితను ప్రశంసిస్తున్నారు. ప్రయాణికుల సామాగ్రి కనబడకపోయిన లేదా అనుకోకుండా వదిలేసి వెళ్లిపోయిన వారికి వాటిని తిరిగి ఇచ్చేలా సనిత చర్యలు తీసుకునేదని రైల్వే అధికారులు వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన సనిత 2020లో ఆర్పీఫ్‌లో చేరిందని ఆ తర్వాత బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో డ్యూటీ నిర్వహిస్తుందని వెల్లడించారు.

Exit mobile version