Rajendra Nagar: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రౌడిషీటర్ పై కత్తులతో దాడిచేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ముబారఖ్ సిగార్ అనే రౌడిషీటర్ ను పై కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా చంపారు. అతని మర్మంగాలు కట్ చేసిన దుండగులు వంటిపై అనేక సార్లు పొడిచి అతి దారుణంగ హత్య చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి వాదియే ముస్తఫా షేహిన్ నగర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
బాలాపూర్ ప్రాంతంలో ముబారఖ్ సిగార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సామాన్యుడిగా ఉన్న ముబారఖ్ అంచలంచెలుగా ఎదిరి రౌడీషీటర్ గా స్థిరపడ్డాడు. అయితే అతని పై ఎవరికి ఏం అన్యాయం జరిగిందో తెలియదు కానీ.. అతడిపై కక్ష పెంచుకున్న కొందరు దుండగులు తన ఒక్కడు చిక్కేందుకు సమయం వైట్ చేశారు. చివరకు ఆ సమయం రానేవచ్చింది. వాదియే ముస్తఫా షేహిన్ నగర్ వద్ద ముబారఖ్ ఒక్కరు చిక్కాడు. దీంతో దుండగులు ప్లాన్ ప్రకారం అతనిపై ఒక్కసారిగా దాడి చేశారు. విచకనా రహితంగా దాడి చేయడంతో ముబారఖ్ అక్కడికక్కడే కిందికి పడిపోయాడు. అంతే కాకుండా ముబారఖ్ పై కర్కసంగా వ్యవహరించారు. అతని మర్మాంగాని కోయడమే కాకుండా విచక్షణారహితంగా కత్తితో పోడిచారు. ముబారఖ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి హుటా హుటిన క్లూస్ టీ, డాగ్ స్క్వాడ్ తో అక్కడకు చేరుకున్నారు.
ముబారఖ్ నిర్జీవ స్థితిలో వుండటంతో షాక్ తిన్నారు. క్రూరాతి క్రూరంగా కత్తులతో దాడిచేడంతోనే ముబారఖ్ మృతి చెందాడని, ఇది గతంలో రౌడీ షీటర్ అని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. హత్యకు గల కారణాలపై విచారణను బాలాపూర్ పోలీసులు ముమ్మరం చేసారు. ముబారఖ్ కు గతంలో ఎవరితో అయినా విరోధం ఉందా? వారే ఈ హత్య చేశారా? లేక కుటుంబంలోని వారే ముబారఖ్ హత్యకు కారకులా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా విరోధం ఉంటే పోలీసుల వరకు తీసుకురావాలని కానీ.. ఇలా మృగాళ్లా మనిషిపై దాడులు చేయడం కరెక్ట్ కాదని పోలీసులు సూచించారు. ముబారఖ్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
Ram Mandir : అయోధ్యకు ఉచిత రైలు.. బిజెపి ప్రభుత్వం కీలక నిర్ణయం