NTV Telugu Site icon

Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో రోహిత్‌ వేముల తల్లి.. ఫోటో వైరల్

Rahulgandhi

Rahulgandhi

Bharat Jodo Yatra: దేశాన్ని మళ్లీ ఏకం చేసేందుకు తెలంగాణలో భారత్ జోడో యాత్రతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధిక వేముల కలిసి సంఘీభావం తెలిపారు. యాత్ర సంద‌ర్భంగా ఇవాళ రోహిత్ వేముల త‌ల్లి సైతం రాహుల్ గాంధీతో క‌లిసి కొద్దిసేపు న‌డిచారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడాల‌ని, రోహిత్ వేముల‌కి న్యాయం చేయాల‌ని కోరారు. రోహిత్‌ తల్లని రాహుల్‌ గాంధీ అక్కున చేర్చుకున్నారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్‌ చేస్తున్నాయి. ఇప్పటికే త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల‌లో పూర్తయింది పాద‌యాత్ర. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాద‌యాత్రలో బిజీగా ఉన్నారు.

రోహిత్‌ వేముల ఎవరు?
2016 జనవరి 17న హెచ్‌సీయూలో రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విసయంత తెలిసిందే.. యూనివర్షిటీ అధికారులు, ఇతర విద్యార్థి సంఘాల వేధింపుల కారణంగానే రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమించాయి విద్యాసంస్థల్లో దళిత విద్యార్థులు హక్కుల పరిరక్షణ కోసం రోహిత్‌ చట్టం రూపిందించాలని డిమాండ్ కూడా చేశారు. త‌న కొడుకుకు జ‌రిగిన అన్యాయం గురించి రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నిల‌దీస్తూ వ‌చ్చారు. అప్పట్లో అది సంచ‌ల‌నంగా మారింది. హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న బండారు ద‌త్తాత్రేయ రాసిన లేఖ క‌ల‌క‌లం రేపింది. ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్ సెంట్రల్ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స్ ల‌ర్ దాష్టీకానికి రోహిత్ వేముల బ‌లై పోయిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అప్పట్లో రాహుల్ ట్విటర్ వేదికగా స్పందిచారు కూడా.. ‘‘రోహిత్‌ వేముల జాతి వివక్ష.. అవమానాలతో హత్యకు గురయ్యాడు. ఇన్నేళ్లు గడిచినా ప్రతిఘటనకు రోహిత్‌, నమ్మకానికి ఆయన తల్లి చిహ్నాలుగా నిలుస్తున్నారు. ప్రాణం పోయే వరకు పోరాడిన రోహితే నా హీరో.. నా సోదరుడు’’అని ట్వీట్‌లో రాహుల్‌ పేర్కొన్నారు.