Shamshabad Airport: భారతదేశంలోని విమానాశ్రయాలలో శంషాబాద్ విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు రోబోల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించినప్పటి నుంచి విమానం ఎక్కే వరకు రోబోలు వారికి అవసరమైన సేవలను అందించనున్నాయి. ఈ మేరకు జీఎంఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది! అవును… ప్రయాణికులకు అవసరమైన సేవలతో పాటు పరిశుభ్రతను మరింత మెరుగుపరిచేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో రోబోటిక్ పరికరాలు, యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 6 నెలల క్రితం జీఎంఆర్ ఇన్నోవెక్స్ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రోబోటిక్ సేవలకు సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు కేంద్రం యోచిస్తోంది!
ఇందుకోసం ఇప్పటికే ఐఐటీ-బాంబే, పెప్పర్‌మెంట్‌లు ఎంఓయూలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే! అదే సమయంలో రోబోటిక్ ఉత్పత్తులను రూపొందించే స్టార్టప్ కంపెనీలను కూడా ప్రోత్సహిస్తామని చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లోగా శంషాబాద్ విమానాశ్రయంలో రోబో సేవలు అందుబాటులోకి రానున్నాయి! ఇప్పటికే ఈ సర్వీస్ కోసం రోబోటిక్ లేబొరేటరీని అందుబాటులోకి తెచ్చిన జీఎంఆర్.. పలు స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు చేస్తున్న ఆవిష్కరణలకు ఎంకరేజ్ చేస్తూ వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అనుభవం ఉన్న వ్యక్తులు, స్టార్టప్ కంపెనీల సౌజన్యంతో రోబోటిక్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని అధికారులు చెబుతున్నారు.
ప్యాసింజర్ సేవలతో పాటు పర్యావరణాన్ని శుభ్రపరిచే విషయంలోనూ ఈ రోబోల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా… ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని జీరో పర్సంటేజీకి తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో విమానాశ్రయంలో రోబోలను అందుబాటులోకి తేవడం ద్వారా ప్రయాణికులకు సమయం ఆదా అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కృత్రిమ మేధతో పనిచేసే రోబోలను అమర్చిన సంగతి తెలిసిందే. వారు ప్రయాణీకులకు విమాన రాకపోకలు మరియు విమానయాన సంస్థల గురించి సమాచారాన్ని అందిస్తారు.
England vs Sri Lanka: శ్రీలంకతో పోరు.. ఇంగ్లండ్‌కు ఆఖరి అవకాశం!