NTV Telugu Site icon

Potholed Roads: రోడ్లు గుంతలు పడ్డ ఎవరు పట్టించుకోరు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలే..

Potholed Roads

Potholed Roads

Potholed Roads: నగరంలోని రోడ్లన్నీ గుంతలు, కంకరతో నిండి స్థానికులు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అధ్వానమైన రోడ్లపై ప్రయాణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు పైపులైన్లు, కేబుళ్ల కోసం తవ్విన రోడ్లను సకాలంలో పునరుద్ధరించకపోవడంతో చాలాచోట్ల దారులు అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడ పడితే అక్కడ గుంతులు పడినా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిరుజల్లులు కురిస్తే నగరం చెరువును తలపిస్తుంది.. అలాంటిది భారీ వర్షం పడిందంటే ఇక సముద్రాన్ని తలపించేలా ఉంటోంది.

Read also: Modi: అటల్ సేతు వంతెనపై రష్మిక మందన్న వీడియో.. స్పందించిన మోడీ

చిన్నపాటి వర్షం పడితే ఆ గోతుల్లో నీరు చేరి చెరువు నిండుతుంది. దీన్ని గుర్తించని డ్రైవర్లు చిన్నచిన్న ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఈ రోడ్డులో ప్రయాణించడం సాహసమేనని అంటున్నారు. కాగా.. నగరంలో రోడ్లు మరింత నరకంగా మారుతున్నాయి. రోడ్లపై గుంతలు తవ్వడంతో వాహనదారులు, పాదాచారులకు తిప్పలు తప్పడం లేదు. లెక్కలేనన్ని గోతులపై గతిలేక ప్రయాణం సాగిస్తున్న వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నాయి. గోతులు పూడ్చేందుకు వచ్చిన జీహెచ్ ఎంసీ సిబ్బంది.. దిబ్బతిన్న రోడ్లపై ప్యాచ్‌వర్కుతోనే సరిపెడుతున్నారు. దీంతో భారీ వర్షం పడగానే రోడ్లన్నీ గుంతలుగా మారుతున్నాయి. వాహనదారులు మాట్లాడుతూ.. జూబ్లిహిల్స్‌ టీటీడీ ఆలయ సమీపంలో రోడ్డు తెగిపోయింది. రోడ్డు రెండుగా చీలిపోవడంతో రాకపోకలు స్థంబించాయి. రోడ్డు తెగిపోయి రెండుగా చీలిపోయిన ప్రమాద సూచికలు కనిపించలేదు. ఇక్కడ రాత్రి వేళలో ప్రమాదాలు జరిగే అవకాశం వుందని, ప్రాణనష్టం జరుగకముందే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Read also: Devara : దేవర రొమాంటిక్ సాంగ్ షూటింగ్ అప్డేట్ వైరల్..

రోడ్లు గుంతలు పడ్డ ఎవరు పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలేక పోతున్నానని అన్నారు. లీడర్లు పాలకులు వాల్ల తీరు మారరని మండిపడ్డారు. కేవలం ఓట్లు కావాలని వస్తారు.. సమస్యలు పరిష్కరించమంటే కనిపించరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అలాగే తయారీ అయ్యారని వాపోయారు. వర్షం పడితే రోడ్లు మాకు నరకం చూపిస్తున్నాయని అన్నారు. రోడ్లు మరింత అద్వానంగా తయారయ్యాయని తెలిపారు. దీనికి తోడు రోడ్లు తవ్వి ఎక్కడికక్కడ వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రోగాలు వస్తున్నాయని, వర్షం పడగానే చెరువుల్లా అయితాయి రోడ్లు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజ్ వాటర్ గుంతలు ఎక్కడ ఎప్పుడు రోడ్లపై ఏమవుతుందో అర్థం కాదన్నారు. గోతులమయంతో మేము ఇబ్బందులు పడుతున్నమంటూ వాపోయాడు. జిహెచ్ఎంసి రోడ్లపై కానీ ప్యాచ్‌వర్కు కూడా వేయడం లేదని తెలిపారు. ఇక
Billboard Collapse: ఎట్టకేలకు పట్టుబడ్డ హోర్డింగ్ యజమాని.. 3 రోజుల్లో 3 రాష్ట్రాలు తిరిగాడు