వినాయక నిమజ్జనం రోజున తెలంగాణ రాష్ట్రంలో విషాదం నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లా లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే… ఈ ఘోర రోడ్డు ప్రమాదం లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… నాగర్ కర్నూల్ జిల్లా… పదర మండలంలోని మద్ది మడుగు సమీపం లో దేవర కొండ డిపో బస్సును…. ఆటో ఢీ కొట్టినట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఈ ఘోర ప్రమాదం లో ఏకంగా నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. మృతి చెందిన వారి లో ముగ్గురు మహిళలు మరియు ఆటో డ్రైవర్ ఉన్నారు. ఇక మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులను మిర్యాలగూడ సమీపం లోని సూర్యాతాండ వాసులుగా గుర్తించారు పోలీసులు.
తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
