DCM Larry Accident: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ఇస్నాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే చనిపోగా.. ఇద్దరు ఆవాహనంలోనే ఇరుక్కుపోయారు. వారిని కాపాడేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
Read also: Shivraj Patil: కృష్ణుడు, అర్జునుడికి “జీహాద్” గురించి చెప్పాడు..
ఇస్నాపూర్ గురుకుల పాఠశాల వద్ద ముగ్గురితో వెళుతున్న డీసీఎం వాహనాన్ని రెడీ మిక్స్ లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఒకరు అందులో ఇరుక్కుపోయి మరణించగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఇద్దరు డీసీఎంలో క్యాబిన్లో లోపలివరకు కాళ్లు ఇరుక్కు పోవడంతో బయటకు తీయడానికి స్థానికులు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంతో రోడ్డు ఇరువైపుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పోలీసులు ట్రాఫిక్ మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
Ori Devuda Movie Review: ఓరి దేవుడా! రివ్యూ