NTV Telugu Site icon

కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం…

కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం తాగి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే రోడ్డు ప్రమాదానికి ముందు ఒక్క కుక్క రోడ్డు దాటింది. జీబ్రా క్రాసింగ్ మీదుగానే ఆ కుక్క రోడ్డు దాటి వెళ్లిపోయింది. కానీ ఆ యువకుడు మాత్రం రాంగ్ రూట్ లో వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. మద్యం తాగి రాంగ్ రూట్ లో కి వెళ్లి ప్రమాదం చేసాడు యువకుడు. అయితే ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.