మావోయిస్టు నేత, దివంగత ఆర్కే జీవిత చరిత్రను ప్రచురించేందుకు ఆయన భార్య శిరీష ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బుక్ ప్రచురణ, ప్రింటింగ్ ప్రెస్ సీజ్ పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కోర్టుని ఆశ్రయించారు ఆర్కే సతీమణి శిరీష. పోలీసులు ఆర్కే జీవిత చరిత్ర ప్రచురణ లో ఉన్న బుక్ లను గత నవంబర్ లో సీజ్ చేశారంటూ పిటిషన్ వేశారు.
బుక్ ల సీజ్ తో పాటు నవ్య ప్రింటింగ్ ప్రెస్ ను సైతం మూసేశారు పోలీసులు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వహణపై పోలీసులు నమోదు చేసిన కేసులపై మరో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ దాఖలు చేశారు రామ కృష్ణ రెడ్డి, పీవోడబ్ల్యు సంధ్య. పిటిషన్ లను విచారణకు స్వీకరించారు జస్టిస్ లక్ష్మణ్. ప్రచురణలో ఉన్న బుక్ లను ఎలా సీజ్ చేస్తారని పోలీసులను ప్రశ్నించింది హైకోర్టు.
వెంటనే సీజ్ చేసిన బుక్ లను తిరిగి ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ప్రింటింగ్ ప్రెస్ కేస్ లో పోలీసుల తీరుపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రామకృష్ణారెడ్డి, సంధ్య పై ఉన్న కేస్ కొట్టేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
