పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగి సామాన్యుల జేబులకు చిల్లులు వేయడానికి రెడీ అయిపోయాయి. రెండు రోజుల స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడంతో వాహనదారులు షాక్ కు గురయ్యారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమని వాహనదారులు అంటున్నారు.
బుధవారం పెట్రోల్ పై 37 పైసల పెంపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46 లకు చేరుకుంది. ఇక డీజిల్ పై 38 పైసలు పెంచగా లీటర్ డీజిల్ ధర రూ.103.56 లుగా ఉంది. ఇలా ఇంధన ధరల మోత.. మా తలరాత అంటున్నారు వాహనదారులు.
ఢిల్లిలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.19 చేరుకోగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.92 వద్ద ఉంది. దీనితో పాటు ముంబాయిలో పెట్రోల్ ధర లీటర్ రూ. 112.11, డీజిల్ లీటర్ ధర రూ.102.89, కలకత్తాలో పెట్రలో లీటర్ ధర రూ. 106.77, లీటర్ డీజిల్ ధర రూ. 98.03, చెన్నయ్ లో లీటర్ పెట్రలో ధర రూ. 103.31 ఉండగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 99.26 కు చేరుకుంది.