Site icon NTV Telugu

రాజేంద్రనగర్ నిర్మాణాలను కూల్చి వేస్తున్న రెవెన్యూ అధికారులు…

రాజేంద్రనగర్ పుప్పాల్ గూడాలో కాందిశీకుల భూములలో వున్న నిర్మాణాలను కూల్చి వేస్తుంది రెవెన్యూ అధికారులు. పుప్పాల్ గూడాలోని సర్వే నెంబర్ 325, 326, 301, 303, 327, 328 గల నిర్మాణాలను జేసీబీల సహాయంతో కూల్చి వేసింది అధికారుల బృందం. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నిర్మాణాలను కూల్చి వేసిన అధికారులు. కూల్చివేతను అడ్డుకున్న రైతులు. రైతులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం. పరిస్థితి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిర్మాణాలలో నివాసం వున్న మహిళలను బలవంతంగా బయటకు రప్పించి… దౌర్జన్యంగా కూల్చివేశారు అధికారులు. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఎంత బతిమిలాడినా కూల్చివేతలు ఆడలేదు. గత 50 సంవత్సరాలుగా ఈ భూముల్లో వ్యవసాయం చేస్తున్నారు రైతులు. రైతు పక్షపాతిగా వున్న తెలంగాణ ప్రభుత్వం… రైతుల భూములను అక్రమంగా లాగేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి వచ్చి ప్రభుత్వ భూములంటూ కూల్చి వేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు.

Exit mobile version