వివిధ సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వరుసగా లేఖలు రాస్తూ వస్తున్న టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… ఇవాళ మరో బహిరంగలేఖ రాశారు.. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల సమస్యలు పరిష్కారం గురించి లేఖలో పేర్కొన్నారు.. సరైన వ్యవసాయ విధానం లేకపోవడంతో, రుణ ప్రణాళిక, పంటల కొనుగోళ్లు, నకిలీ, కల్తీ విత్తనాలు, పురుగు మందులు తదితర సమస్యల నేపథ్యంలో రైతు అప్పుల పాలై దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లిన రేవంత్.. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల పరిస్థితి నన్ను ఎంతగానో కలచివేసిందన్నారు..
Read Also: Aam Aadmi Party: ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో పాదయాత్ర..
ఇటీవల నేను మహబూబాబాద్ ప్రాంతంలో పర్యటించి వచ్చి ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశాను.. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే రెండు నెలల్లో 20 మంది రైతులు ఆత్మహత్యలు చేస్కున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ అర్ధం చేసుకోవాలని సూచించారు రేవంత్‌రెడ్డి.. ఇటీవల మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదికలు మహబూబాబాద్ ప్రాంతాల్లో పర్యటించి నివేదికలు సమర్పించాయి. రైతులకు ఒక్క ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి అవుతుంది. ప్రతి రైతుకు 6 నుంచి 12 లక్షల వరకు అప్పు ఉందన్నారు.. అప్పుల బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వెంటనే 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.. ఇక, లక్ష రూపాయల రుణ మాఫీ వెంటనే అమలు చేయాలని కోరారు.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల ప్రైవేట్ అప్పుల విషయంలో ప్రభుత్వం బాధ్యత వహించాలని సూచించిన రేవంత్.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబంలోని పిల్లలను ప్రత్యేక కేటగిరి కింద గుర్తించి ప్రభుత్వం ఉచితంగా చదివించాలన్నారు.. కౌలు రైతులకు రైతులకు ఇచ్చే అన్ని సౌకర్యాలు కల్పించాలని.. కల్తీ, నకిలీ పురుగు మందులు నివారణకు తగిన పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని.. రైతు వేదికలను పునరుద్ధరించి, వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి రైతులను ఆదుకోవాలి డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
