Revanth Reddy Wrote Letter To CM KCR Over TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ పేపర్ లీకేజ్‌కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. గడిచిన 9 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో పదే పదే మోసం చేస్తున్నారని.. రాష్ట్రంలో 1.92 లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతేడాది బిస్వాల్ కమిటీ నివేదిక స్పష్టం చేసినప్పటికీ ఆ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచడం చేయడం లేదని మండిపడ్డారు. వందలాది మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ.3106 భృతి ఇస్తానని హామీ ఇచ్చి, మోసం చేశారని ఆరోపించారు.
BJP Leader Prakash Reddy: పేపర్ లీకేజ్‌కి బాధ్యత వహిస్తూ.. కేటీఆర్ రాజీనామా చేయాలి
ఇప్పుడు మరో 9 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు, షెడ్యూల్స్‌ని ప్రకటించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కనీసం ఈ కొన్ని ఉద్యోగాలనైనా పారదర్శకంగా భర్తీ చేస్తారని ఆశిస్తే.. మీ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా పేపర్ లీకులై, పరీక్షలు రద్దు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్పు చేసింది మీరైతే శిక్ష మాత్రం నిరుద్యోగ యువతకు ఎందుకు వేయాలి? అని ప్రశ్నించారు. మీరు పరీక్షలు రద్దు చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదన్నారు. ఈ పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా కంటితడుపు వ్యవహారాలు చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరికే ఉండదని హెచ్చరించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి మీ పార్టీతోపాటు బీజేపీతో రాజకీయ సంబంధాలు ఉన్నట్లు విచారణ అధికారులే చెప్తున్నారని.. ఈ అంశాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనే భావన కలుగుతోందని అన్నారు.
పేపర్ లీకేజీ విషయంలో సాంకేతికపరమైన లోసుగులు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. సంబంధిత ఐటీ శాఖ మంత్రిగా ఉన్న మీ కుమారుడు కేటీఆర్ కుడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన చైర్మన్, సభ్యులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంత భారీ కుంభకోణంతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే, సీఎం కనీస సమీక్ష చేయలేదన్నారు. ఈ స్కాం విషయంలో ఎందుకు తేలు కుట్టిన దొంగల్లా ఉంటున్నారని ప్రశ్నించారు. సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతుందనే నమ్మకం లేదని పేర్కొన్న ఆయన.. తక్షణమే టీఎస్‌పీఎస్‌సీ బోర్డుపై చర్యలు తీసుకోవాలని, ఐటీ శాఖ బాధ్యత వహిస్తున్న కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.