Revanth Reddy: కేసీఆర్.. భోజనానికి ముందు ఆత్మపరిశీలన చేసుకో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Questions KCR On Foods In Schools and Colleges: ఇటీవల పాఠశాలలు, కళాశాలల్లో భోజనాలు చేసి.. విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. హనుమకొండ జిల్లాలోని మహాత్మా జోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత నీరు, ఆహారం కారణంగా ఎనిమిది మంది విద్యార్థులు ఆసుపత్రిపాలయ్యారు. తాజాగా పప్పులో వానపామునే వడ్డించే ఘటన తెరమీదకొచ్చింది. రాత్రి చేసిన కూరనే ఉదయం వడ్డించడం, కడగని పాత్రల్లోనే భోజనాలు చేయడం లాంటి సంఘటనలు వెలుగు చూశాయి. ఫలితంగా.. వందలాది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విటర్ మాధ్యమంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ‘పురుగలన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి?’ అని ఆయన ఫైరయ్యారు. కేసీఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలేమీ తెలియవని.. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా? అంటూ నిలదీశారు. పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికోసమని ప్రశ్నించారు. భోజనం తినేముందు ఓసారి ఆత్మపరిశీలన చేసుకోమ్మని కేసీఆర్‌ని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ట్వీట్‌కు విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనల వార్తల్ని ప్రచురించిన ఓ వార్తా పత్రిక పేజీని షేర్ చేశారు.
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
పురుగలన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి?
భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా?
పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి? భోజనం తినేముందు ఆత్మపరిశీలన చేసుకో కేసీఆర్. pic.twitter.com/itmuKie7oj
— Revanth Reddy (@revanth_anumula) July 30, 2022
తాజావార్తలు
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
ట్రెండింగ్
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!