Revanth Reddy: వికారాబాద్ కు మెడికల్ కాలేజ్ రావడం గడ్డం ప్రసాద్ కృషి ఫలితమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. ఇవాళ శాసనసభ ప్రారంభమైన అనంతరం స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్‌గా నియమితులైన గడ్డం ప్రసాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు, అన్ని పార్టీల సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అసెంబ్లీ మంచి సంప్రదాయానికి నాంది పలికిందన్నారు. భవిష్యత్తులోనూ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా సభలో స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన మంత్రులు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను సభకు తెలియజేశారు. తొలుత స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌ను అభినందించారు. సభ ఒక మంచి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Read also: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. కార్ల కలర్ మార్చాలని ఆదేశం
ఈ సంప్రదాయం ముందు ముందు ఇలాగే కొనసాగాలన్నారు. వికారాబాద్… మంచి వైద్యం అందించేందుకు అనువైన ప్రాంతం అన్నారు. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఎన్నికవడం అని తెలిపారు. సమాజంలోని ఎన్నో రుగ్మతలను పారద్రోలవచ్చని నేను ఆకాంక్షిస్తున్నా అని అన్నారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు గడ్డం ప్రసాద్ గారికి బాగా తెలుసన్నారు. మనందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఆయన సమర్ధవంతంగా నిర్వహించగలరని తెలిపారు. వికారాబాద్ కు మెడికల్ కాలేజ్ రావడం గడ్డం ప్రసాద్ గారి కృషి ఫలితమే అని తెలిపారు. అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నెగూడా చౌరస్తా వరకు రోడ్డు విస్తరణకు ఆయన చొరవ చూపారుని అన్నారు. ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఎదిగిన ఆయన కృషి ఎంతో అభినందనీయమని సీఎం తెలిపారు. సభలో అందరి హక్కులను వారు కాపడగలరన్న పూర్తి విశ్వాసం ఉందని అన్నారు.
Karachi Bakery: కరాచీ బేకరీలో పేలిన సిలిండర్.. ఆరుగురి పరిస్థితి విషమం!
