NTV Telugu Site icon

CM Revanth Reddy: త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు.. రేవంత్ సర్కార్‌ చర్యలు

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండిగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించింది. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులను జారీ చేసే సమస్యను రేవంత్ సర్కార్ ప్రారంభించింది. త్వరలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం.. విధి విధానాలను సృష్టించడం కూడా ప్రారంభించింది. అయితే సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్రటేరియట్‌లో సివిల్ సప్లైస్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ప్రస్తుత రేషన్ కార్డులపై అధికారులతో మంత్రి ఈ సమస్యపై చర్చించారు. అంతేకాకుండా.. కొన్ని నెలలుగా రేషన్‌ తీసుకోని కార్డులు ఉంచాలా తీసేయాలా అనే అంశంపై కూడా అధికారులతో చర్చించారు. అయితే.. అసలైన అర్హులకే కార్డులుండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

Read also: Weather: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి.. వాతావరణ శాఖ హైఅలర్ట్..

మరోవైపు, కొత్త కార్డులకు ఎవరు అర్హత ఉన్నారనే దానిపై కొనసాగుతున్న ఇంకా లోతుగా చర్చలు జరుపనున్నట్టు తెలుస్తోంది. సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు అనుసంధానించబడకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. రేషన్ కార్డు సంక్షేమ పథకాలకు అనుసంధానించబడితే, కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితిని ఎంత విధించాలో ఈ వారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత 9 సంవత్సరాలుగా ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం వేచి ఉన్నారు. మహాలక్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ సిలిండర్ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చర్చించారు. రైతుల నుండి ధాన్యం సేకరణ.. రేషన్ లబ్ధిదారులు కూడా నాణ్యమైన బియ్యం సరఫరా గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు, సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
Bigg Boss Telugu 7 : అమర్ దీప్ సీక్రెట్ ను బయపెట్టిన అర్జున్.. ఓ ఆట ఆడుకున్న శివాజీ..