NTV Telugu Site icon

CM Revanth Reddy: రైతు భరోసా అందిస్తే ముక్కు నేలకు రాస్తావా? కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..

Revanth Reddy Kcr

Revanth Reddy Kcr

CM Revanth Reddy: రైతు భరోసా అందిస్తే ముక్కు నేలకు రాస్తావా? అని కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పోరాటాల చరిత్ర ఖమ్మం ఎప్పుడూ ముందు వుంటుందన్నారు. 1969 తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభం అయిందన్నారు. 2014,18,23 మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. దుర్మార్గుడు నీ ముందే గుర్తించిన జిల్లా ఖమ్మం అన్నారు. నయవంచన, నక్కజిత్తుల, కాలకూట విషము అయిన కేసీఆర్ ను ముందే పసిగట్టినది ఖమ్మం జిల్లా అన్నారు. ఖమ్మం జిల్లా మిగిలిన జిల్లాలకు ఆదర్శం అన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నేను ఎక్కువగా జోక్యం చేసుకోనని తెలిపారు.

Read also: Madhya pradesh: భార్యతో అసహజ శృంగారం అత్యాచారం కాదు.. హైకోర్టు కీలక తీర్పు

ఖమ్మం జిల్లాలో ప్రతి కార్యకర్త ఒక్క ముఖ్యమంత్రి వుంటారని తెలిపారు. వాళ్ళే నాయకత్వం వహిస్తారని తెలిపారు. దేశ రాజకీయాలకు ఖమ్మం జిల్లా దిక్సూచి అన్నారు. కేసీఆర్ ఖమ్మం జిల్లాకు వచ్చారన్నారు. ఏ సంకీర్ణంలో చేరుతావు కేసీఆర్? అని ప్రశ్నించారు. మేము చేర్చు కోమన్నారు. కేసీఆర్ చేరేది బీజేపీ సంకీర్ణం లోనే అన్నారు. అనేక సార్లు బీజేపీ బిల్లులకు మద్దతు ఇచ్చింది కేసీఆర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో తాకట్టు పెట్టింది బీజేపీ అన్నారు. కార్ కార్ఖాన నుంచి ఇక రాదన్నారు. మీరు ఎన్నికల్లో గెలువరు, నమ్మించి కేసీఆర్ మోసం చేస్తారన్నారు. నామా నాగేశ్వర రావు కేసీఆర్ నమ్మి మోసపోవద్దు.. ఆ కుటుంభంను నమ్మవద్దన్నారు. సెమీ ఫైనల్ లో బీఆర్ఎస్ నీ ఓడించాం.. మే 13 ఫైనల్స్ లో గుజరాత్ టీంను ఓడించాలన్నారు. మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు.

Read also: Barbie Telugu OTT : ఓటీటీలోకి ఆస్కార్ కొట్టిన హాలివుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కేసీఆర్ మీ మెదడు ఏమన్నా దొబ్బింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు అన్యాయం, ద్రోహం చేసింది బీజేపీ అన్నారు. తెలంగాణ ఏర్పాటును మోడీ అవమానించారన్నారు. కేసీఆర్ మందు వేసి మాట్లాడుతున్నాడో ఏమో కానీ.. ఓ వెదవ దద్దమ్మ సన్నాసి అన్నారు. భట్టి గట్టి వ్యక్తి కాబట్టి కేసీఆర్ ఎన్ని అప్పులు చేసిన రైతు బందు, జీతాలు ఇస్తున్నారన్నారు. కేసీఆర్ సన్నాసి .. మే9 న అమర వీరుల సాక్షి వద్ద చర్చ పెడుదాం అన్నారు. సవాల్ చేస్తున్నాను.. రైతు భరోసా అందిస్తే ముక్కు నేలకు రాస్తావా? అని ప్రశ్నించారు. సిద్దిపేట కు శని వదిలేస్తానని, 15 రెండు లక్షల రుణ మాఫీ చేసి సిద్దిపేటలో హరీష్ బుద్ధి చెప్తామన్నారు. హరీష్ రావు పారిపోదామని ప్లాన్ వేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దింపుడు కళ్లెం ఆశ మాత్రమే.. ఆ ఆశ కూడా ఉపయోగం కూడా లేదన్నారు. ఆసరా పెన్షన్ రావడం లేదు అని ఆరోపణలు అబద్ధం అన్నారు.

Read also: BJP: ప్రియాంక గాంధీని రాహల్ తొక్కేస్తున్నాడు..

బండి సంజయ్, కిషన్ లను అడుగుతున్నాను..మీ పార్టీ నేతలు చెప్పింది నిజం కాదా రాజ్యాంగం ప్రియంబుల్ మారుస్తామని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజ్యాంగం మరిస్తమని చెప్పారు కదా? అని ప్రశ్నించారు. ఎస్టీ ఎస్సి రిజర్వేషన్ లు తొలగించబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే రిజర్వేషన్ లు పెరుగుతాయన్నారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ మెడ పై కత్తి వేలాడుతోందన్నారు.
Kerala : బాత్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. అమెజాన్ ప్యాకెట్‌లో పెట్టి రోడ్డుపై విసిరిన తల్లి