Site icon NTV Telugu

Congress : రేవంత్‌ రెడ్డి, జగ్గారెడ్డిల కీలక భేటీ..

Very Interesting Incident at CLP Office Today. TPCC Revanth Reddy and MLA Jaggareddy meet.

నేడు సీఎల్పీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిలో మధ్య నెలకొన్న పరిణామాలు ఆ పార్టీలో కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అనుహ్యంగా జగ్గారెడ్డి, రేవంత్‌ రెడ్డిలు భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది. నేడు సీఎల్పీ కార్యాలయానికి రేవంత్‌ రెడ్డి వచ్చారు. అయితే అదే సమయంలో సీఎల్పీ కార్యాలయంలో ఉన్న జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా పలకరించారు. ఈ విషయాన్ని గుర్తించిన మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగానే మీడియాకు ఇద్దరు నేతలు ఫోజులు ఇచ్చారు. అంతేకాకుండా ఆ తర్వాత ఇద్దరు నేతలు సుమారు 20 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. అయితే తాము ఏం మాట్లాడామో చెప్పబోమని జగ్గారెడ్డి వెల్లడించడం గమనార్హం.

అయితే రోజురోజుకు కాంగ్రెస్‌ దేశంలో బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్న వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతవడంత దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్‌లో అక్కడక్కడ అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. అయితే రాబోయే ఎన్నికలకు సిద్ధంకావడం కోసమే.. జగ్గారెడ్డి, రేవంత్‌ రెడ్డిలు వారి మధ్య ఉన్న అస్పష్టతమైన పరిస్థితిని ఎండగట్టడానికే సమావేశమై ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version