Site icon NTV Telugu

మరికాసేపట్లో తెలంగాణ పీసీసీగా రేవంత్‌ బాధ్యతల స్వీకరణ..

ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీ భవన్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి చార్జీ తీసుకుంటారు. అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. సీనియర్లను కలుపుకుపోవడం ఒక ఎత్తు అయితే.. కేడర్ లో జోష్ నింపాల్సిన బాధ్యత మీద పడింది. ఇప్పటికే జానారెడ్డి మొదలుకుని ఒక్కొక్కరు సీనియర్ నేత ఇళ్లకు వెళ్లి కలిసి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. అందరినీ కలుపుకుపోతానని రేవంత్ చెబుతున్నా.. అదంత తేలికగా కనిపించడం లేదు.

read also : దూకుడు పెంచిన పవన్‌.. నేడు అమరావతికి పయనం !

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎప్పుడు.. ఎవరు ఎలా స్పందిస్తారో ఊహించడం చాలా కష్టం. అసమ్మతి రాగం. అసంతృప్తులు మామూలే. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య, పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు పెద్ద సవాల్ విసురుతున్నాయి. రేవంత్ ఒక్కడే తెలంగాణ కాంగ్రెస్ ని నడిపించగలరా.. ? సీనియర్లను సమన్వయం చేసుకోగలరా ..? సొంత కోటరీ ఏర్పాటు చేసుకోగలరా.. ? ఎంతమంది నేతలు రేవంత్ రెడ్డికి సహకరిస్తారు … ? రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందా …? అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది.

Exit mobile version