NTV Telugu Site icon

Renuka Chowdhury: కేటీఆర్ ఐటీలో కింగ్ అంటారు.. ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు

Renukachuwdari Ktr

Renukachuwdari Ktr

Renuka Chowdhury: మంత్రి కేటీఆర్ ఐటిలో కింగ్ అంటారు.. ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు అంటూ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. గెలుపు తధ్యం అనేది జగమెరిగిన సత్యమని ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా గెలిచేది కాంగ్రెస్ అన్నారు. 10కి 10 స్థానాలు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ లు పదేపదే వాయిదాలు ఎందుకు పడుతున్నాయన్నారు. ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? అని ప్రశ్నించాఉ. నిరుద్యోగుల తల్లిదండ్రుల భాద వర్ణనాతీతమన్నారు. దేశ భవిష్యత్తులో భాగస్వాములు కావాల్సిన యువత ఉద్యోగాలు లేక పెడదారి పడుతున్నారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ కు ఊహించని ఆదరణ లభిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలనుంచి ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ ను అన్నారు. పరిపాలన దిగజారినపుడు ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తలిపారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కారుగుర్తు రద్దు కాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతలు అధికార మదంతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు. అవన్నీ మాకు బలంగా మారుతున్నాయన్నారు.

బీఆర్ఎస్ ను ప్రజలు చెంప దెబ్బ కొట్టబోతున్నారని అన్నారు. ఆత్మపరిశీలన చేసుకోవాలి బీఆర్ఎస్ నాయకులని అన్నారు. బ్రహ్మాండమైన స్పందన వస్తుంది కాంగ్రెస్ కు అన్నారు. ఎంఐఎం నేతలు ఎన్ని చెప్పినా ముస్లిం సోదరులు తరలి వచ్చి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఇవ్వలా అజారుద్దీన్ మాకు మద్దతు ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఖిల్లాలో ఉన్న ముస్లిం సోదరుల వద్దకు వెళ్తున్నామన్నారు. ఖిల్లాను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశా అన్నారు. జిల్లాలో చేపల పెంపకాన్ని ఏర్పాటు అంటే నా వల్లనే అని తెలిపారు. ఖమ్మం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసింది నేనే అని, ఖమ్మం నుంచి గార్ల వరకు రైల్వే స్టేషన్ లు అభివృద్ధి చేసింది నేనని అన్నారు. జిల్లాలో గిరిజన భవనాలు కట్టి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టానని తెలిపారు. కొన్నాళ్ళు ప్రజలు ఎందుకో దూరం పెట్టారని.. ఇపుడు వాళ్లకు ఎవరేంటో అర్ధమై మల్లీ మన వద్దకు వస్తున్నారని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇల్లు రెండు ఏళ్లకే కురుస్తున్నాయని మండిపడ్డారు. పోలీసులు కూడా వచ్చి వారి బాధలు చెప్పుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జీతాలు 15 వ తేదీన పడుతున్నాయని, రైతులకు బేడీలు వేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఇక్కడ రైతు బంధు ఇవ్వరు, రుణమాఫీ ఇవ్వరు కానీ పక్క రాష్ట్రానికి ఆర్ధిక సహాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఐటిలో కేటీఆర్ కింగ్ అంటారు కానీ.. ఉద్యోగాలు మాత్రం ఇవ్వరని తెలిపారు. ఓటు సామాన్యుడి అస్త్రమన్నారు. జాగ్రత్తగా ఓటుని ఉపయోగించుకోవాలని తెలిపారు. తెలంగాణకు పునాది వేసింది సోనియా గాంధీ కాబట్టి.. కాంగ్రెస్ కు ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలన్నారు. సంబాని, ఎడవల్లి లకు భాద కలగడం సహజమన్నారు. పొత్తులో సీటు పోయింది ఎవరేం చేస్తామన్నారు. వాళ్ళు పార్టీ మారడం భాద అనిపించింది కానీ.. మళ్లీ వారు పార్టీలోకి వస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. రామసహయం మాధవి రెడ్డి ని సస్పెండ్ చేయడం దారుణమన్నారు. చంద్రబాబుకు కష్టకాలంలో సహకరించాం కాబట్టే.. ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారని అన్నారు. కొత్తగూడెంలో సీపీఐకి సీటు ఇచ్చాము కాబట్టి.. ఖమ్మం సీపీఐ పార్టీ కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరారు. సీఎల్పీ నేత భట్టి నిర్ణయాన్ని గౌరవించాలన్నారు.
Family Suicide: అగ్గిరాజేసిన అక్రమ సంబంధం.. కుటుంబం మొత్తం ఆత్మహత్య