Site icon NTV Telugu

భార్యను బండరాయితో కొట్టి చంపిన భర్త

పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.మంథని రెవెన్యూ డివిజన్, కాసిపేట మండలం ఉప్పట్ల గ్రామానికి చెందిన రేణుక (35) భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. గత కొన్ని రోజలుగా భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా తరుచు గొడవలు పడుతు ఉండేవారు. ఈ రోజు కూడా గొడవ పడ్డారు. కాగా మధ్యాహ్నం పెద్దల సమక్షంలో కుటంబ సమస్యలపై పంచాయతీ పెట్టారు.

పెద్దలు ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి రాజీ కుదర్చాలని చూశారు. కానీ అంతలోనే ఘోరానికి పాల్పడ్డాడు రేణుక భర్త. పంచాయితీలో భర్తతో ఉండనంటూ వెళ్తున్న భార్యపై నడివీధిలో బండరాయితో తలపై కొట్టి చంపాడు రేణుకను భర్త. కాగా ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులు తెలిపారు.

Exit mobile version