NTV Telugu Site icon

Errabelli Pradeep: మొన్న పొంగులేటి.. ఇప్పుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు.. సెక్యూరిటీ తొలగింపు

Yerrabelli Pradeep Ravu

Yerrabelli Pradeep Ravu

Removal of security to Errabelli Pradeep Rao: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తరహాలోనే మరో లీడర్‌కి షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరులు బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కు గన్ మెన్ తొలగించింది. ప్రదీప్‌రావుకు 2+2 సెక్యూరిటీ కల్పించింది ప్రభుత్వం.. బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు గన్‌మెన్లను తొలగించింది. అయితే.. ఏడేళ్లుగా నలుగురు గన్‌మెన్లు ప్రదీప్‌రావుకు భద్రత కల్పిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఆ నలుగురు గన్‌మెన్లను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే గన్‌ మెన్ల తొలగింపుపై ప్రదీప్‌ రావు తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. బీజేపీలో చేరడంతో కక్షసాధింపు ధోరణితో గన్ మెన్ లను తొలగించారని ప్రదీప్ రావు ఆరోపించారు. గత ఏడేళ్ళుగా ఉన్న 2 ప్లస్ 2 గన్ మెన్ లను సడెన్ తొలగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణహాని ఉంటేనే కదా గన్ మెన్ లను కెటాయించిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే.. నా అంతు చూస్తానని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులో గన్ మెన్ లను తొలగించడం ఎంతవరకు సమంజసం? అంటూ ప్రశ్నించారు. జరగకూడనిది జరిగితే అందుకు ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎర్రబెల్లి ప్రదీప్ రావు మండిపడ్డారు.

అయితే.. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. ఇప్పటికే ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటే ప్రదీప్ రావు కూడా ఆగస్టు 7న ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరాల్సి ఉన్నప్పటికీ.. వాయిదా పడింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. ఢిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో ప్రదీప్ రావు కాషాయ కండువా కప్పుకున్నారు.

Read also: Santhosh Kumar: 2023 క్యాలెండరును ఆవిష్కరించిన ఎంపీ సంతోశ్​ కుమార్

మాజీ ఎం.పీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగిరెద్దుల అడించే వారిలా సంక్రాంతి కి రాలేదని అన్నారు. అధికారం లేకపోయినా..సెక్యూరిటీ నీ నేను అడుగలేదని.. తీసివేసిన నేను అడుగలేదని అన్నారు. వున్న ఇద్దరు గన్ మెన్ లను తీసివేసిన నొచ్చుకొనని అన్నారు. నాకు సెక్యూరిటీ అవసరం లేదు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని తెలిపారు తనకు ఈ సెక్యూరిటీ అవసరం లేదని స్పష్టం చేశారు. తను ఉగ్రవాదినీ కాదని, కబ్జా లు ఎక్కడ చేయలేదని.. సంపాదించుకున్న దానిని ఖర్చు పెడుతున్నానని పొంగిలేటి అన్నారు. పదవులు లేకపోయినప్పటికీ నేను తిరుగుతున్న సమయంలో నాకు ప్రజల ఆవేదన, ఆక్రోశం చూశానన్నారు. రాజకీయంగా గాడ్ ఫాదర్ ఎవ్వరూలేరన్నారు. నాకు గాడ్ ఫాదర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలని తెలిపారు. కొద్ది మంది అంటున్నారు పినపాక కు నికేమి పని అంటున్నారని అన్నారు. ప్రజల కష్ట సుఖల్లో పాలు పంచుకునేందుకు వచ్చానని స్పష్టం చేశారు. వై.ఎస్.ఆర్ బరిలో ముగ్గురిని గెలిపిస్తే మరో ఇద్దరు ముందే టీఆర్ఎస్ లో చేరారని అన్నారు. కేసీఆర్ నాయకత్వం లో కేటీఆర్ ఆధ్వర్యంలో పని చేశానని తెలిపారు.

అయితే తాజాగా.. బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ సర్కార్ ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. పొంగులేటి సెక్యూరిటీని కుదించింది. కాగా.. 3+3 నుంచి 2+2కు గన్‌మెన్లను తగ్గించింది. ఇక.. మరోవైపు క్యాంపు ఆఫీస్‌లో ఉండే 4+1 సెక్యూరిటీని పూర్తిగా తొలగించింది సర్కార్. దీంతో.. పొంగులేటి ఎస్కార్ట్ వాహనాన్ని కూడా తొలగించింది. అంతేకాకుండా.. పార్టీలో.. ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యత కల్పించకపోవడంతో కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈసందర్భంగా.. ఎప్పటినుంచో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో.. తాజాగా ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పార్టీపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు శ్రీనివాస్‌ రెడ్డి. తనకు టికెట్‌ ఇచ్చినా ఇవ్వకున్నా గట్టిగా పోటీ చేస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడం హాట్‌ టాపిక్‌ గా మారింది. అయితే.. ఇప్పటి వరకు ఎదురు చేశానని ఇంకా ఓపిక లేదని.. ఇంకెప్పుడు అవకాశం ఇస్తారంటూ సూటిగానే ప్రశ్నించారు. దీంతో గన్‌మెన్లను తగ్గించడం.. ఎస్కార్ట్ తొలగించడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారిన విషయం తెలిసిందే… అయితే ఇప్పుడు ఎర్రబట్టి ప్రదీప్‌ రావు సెక్యూరిటీ తొలగింపుపై రాజకీయ వర్గాల్లో చర్చకొనసాగుంతుది. అయితే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్‌ ఎవరంటూ ఉత్కంఠంగా మారింది.
Kamareddy Master Plan: మాస్టర్ ప్లాన్ పై నేడు మరో సారి హైకోర్టులో విచారణ.. రైతుల్లో ఉత్కంఠ