NTV Telugu Site icon

OU Registrar: మరోసారి జరగదు.. విద్యార్థినుల రక్షణ మాదే.. ఓయూ రిజిస్టార్ క్లారిటీ

Ou Secendrabad

Ou Secendrabad

OU Registrar: ఇద్దరు ఆగంతకులు అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ బాత్ రూం లోకి చొరబడిన ఘటన సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ లో కలకలం రేపిన విషయం తెలిసిందే.. ఇద్దరిలో ఒకరు పరారీలో ఉండగా.. మరొకరిని పట్టుకున్న విద్యార్థినిలు అతన్ని దేహశుద్ది చేసి కట్టేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్ వద్దకు చేరుకున్న పోలీసులు ఆగంతకున్ని పట్టుకుని తీసుకునే వెళుతుండగా.. విద్యార్థినికులు అడ్డుకున్నారు. అధికారులు, పోలీసులు స్పందించి న్యాయం చేయాలని లేకుంటే ఆందోళన విరమించమంటూ మండిపడ్డారు. న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. రిజిస్టార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టార్ లక్ష్మీ నారాయణ స్పందించారు.

Read also: Crypto Hacking 2023: క్రిప్టోకరెన్సీపై కన్నేసిన హ్యాకర్లు.. గతేడాది వేల కోట్లు దోచుకున్నారు

పీజీ ఉమెన్స్ హాస్టల్ ఆగంతకుడు దూకిన ప్రాంతంలో అవసరమైన రక్షణా చర్యలు చేపట్టామన్నారు. కంటోన్మెంట్ కు ఆనుకొని ఉన్న గోడ మీది నుండి దూకాడని అన్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో వాష్ రూమ్స్ నిర్మిస్తున్నామని అన్నారు. ఈ ఘటన తరువాత హాస్టల్ వెనక వైపు ఎవరూ రాకుండా సీల్ చేసే విధంగా ఇంజనీరింగ్ టీమ్ కు చెబుతామన్నారు. విద్యార్థినుల రక్షణ పూర్తి బాధ్యత మా పై ఉంటుందన్నారు. ప్రిన్సిపాల్ కు విద్యార్థినుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యల పై ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఫీమేల్ సెక్యూరిటి గార్డులను పెంచడానికి అవరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
India vs England: తొలి ఇన్సింగ్స్ లో భారత్ ఆలౌట్.. జడేజా సెంచరీ మిస్..