Site icon NTV Telugu

Munugode By Poll: ఏరులై పారుతోన్న మద్యం.. ఎన్ని కోట్ల లిక్కర్‌ తాగేశారో తెలుసా?

Munugode

Munugode

Munugode By Poll: మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్నాయి. అయితే అక్కడ చేస్తున్న ప్రచారం కంటే మందు, విందు మాత్రం ఏరులై పారుతోంది. ఇది విన్నమనకు మనుగోడులో మనం ఎందుకు లేమా అనిపిస్తుంది. అవును మరి ఉప ఎన్నిక ప్రచారంలో మద్యం..దానికి తోడు.. మటన్‌, చికన్‌, బోటీకూరా.. డబ్బుల వర్షం ఇక మనమే అక్కడుంటే పండగే అన్నట్లు ఉంటది. అయ్యో మనం ఇవిన్నీ మిస్‌ అవుతున్నాము అనుకుంటున్నాము. అక్కడ కోడి, మేకల తలలు లెక్కలు కట్టలేనంతగా తెగిపడుతుంటే.. మద్యం అరేబియా సముద్రంలా పారుతుంది. మరి అక్కడ ఎవరు ఎంత తిన్నారు? ఎంత ఖర్చ పెట్టారు? ఒక్క సారి లుక్‌ వేద్దాం.

Read also: Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలి..

మునుగోడు ఉప ఎన్నిక సమీపించేకొద్దీ మద్యం వెల్లువెత్తుతోంది. దీంతో.. ప్రజలను ఆకట్టుకునేందుకు కోళ్లు, మేకల తలలు తెగిపడుతున్నాయి.. తాగినోళ్లకు తాగినంత, తిన్నోళ్లకు తిన్నంతగా ప్రధాన పార్టీల నిత్య విందులు సాగుతున్నాయి. ఇక ఆబ్కారీ శాఖ గణాంకాల ప్రకారం నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో అక్టోబరు నెల 22 రోజుల వ్యవధిలో రూ.160.8 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని చెబుతున్నాయి… నెల ముగిసే నాటికి రూ.230 కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు. ఇక గతంలో సాధారణంగా నల్గొండ జిల్లాలో నెలకు సగటున రూ.132 కోట్ల మద్యం అమ్మకాలు జరిగేవి. అయితే.. ఇక తాజాగా ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే విక్రయాలు అంతకు రెట్టింపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కుగా మునుగోడులో.. అత్యల్పంగా గట్టుప్పలలో అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీశాఖ లెక్కలు వెల్లడయ్యాయి.

Read also: Dhoni First Production: ధోని ఫస్ట్ సినిమాకు హీరోయిన్ దొరికేసింది

అయితే ప్రచారానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు రోజూ రెండు పూటలా మాంసాహారం కోసం అన్ని గ్రామాల్లో మాంసం వినియోగం గరిష్ఠస్థాయికి చేరింది. దీనికోసం ఇప్పటివరకు ప్రధాన పార్టీలు రూ. 50 కోట్ల వరకు ఖర్చుపెట్టాయని అంచనా… చిల్లర, టోకు దుకాణాల వద్ద నాలుగు, ఐదింతల వ్యాపారం పెరిగింది. గతంలో రోజూ 50 కిలోల చికెన్‌ అమ్మేవాణ్ని. ప్రస్తుతం రోజూ గిరాకీ 200 కిలోలు ఉంటోంది. ఆర్డర్ల ద్వారా మరో 200 కిలోలు గ్రామాలకు సరఫరా చేస్తున్నాను. ఉప ఎన్నిక పుణ్యమా అని నా అప్పులు తీరిపోయాయి’ అని చెప్పారు మునుగోడులోని ఓ దుకాణదారు. ఈ మండలంలో 1600 ఓట్లున్న ఓ గ్రామంలో గత 20 రోజులుగా సుమారు 80 మేకలు, గొర్రెలను ఆహారానికి వినియోగించారు. చౌటుప్పల్‌ మండలంలో ఓ ప్రధాన పార్టీ ముఖ్య నాయకుడు ఇన్‌ఛార్జిగా ఉన్న గ్రామంలో 20 రోజులుగా సుమారు 120 మేకలను వధించారు. కోడి మాంసం వీటికి అదనం. నల్గొండ, దేవరకొండ, నకిరేకల్‌, నాగార్జునసాగర్‌తో పాటు నాగర్‌కర్నూల్‌ జిల్లా నుంచి నిత్యం నియోజకవర్గానికి సుమారు 40 వాహనాల్లో మేకలు వస్తున్నాయని.. ప్రధాన పార్టీల భోజనాల్లో శాకాహారంతో పాటు మటన్‌ లేదా చికెన్‌, కొన్నిచోట్ల తలకాయ కూర, బోటీ కూడా పెడుతున్నారు.

Exit mobile version