Site icon NTV Telugu

Real Estate Fraud Update: మాదే తప్పు.. మా డబ్బులు ఇప్పించండి.. జేవి బిల్డర్స్ బాధితులు..!

Real Estate Fraud Update

Real Estate Fraud Update

Real Estate Fraud Update: హైదరాబాద్ ఉప్పల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఒకటి కాదు రెండు ఏకంగా రూ.500కోట్లతో ఉండాయించిన ఘటన సంచలనంగా మారింది. జెవి బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియలేస్టేట్ కంపెనీ పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను రిమోసం చేసి కోట్లాది రూపాయలను దండుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అమాయక ప్రజలను పెట్టుబడులుగా మోసం చేస్తూ కోట్లు కొల్లగొట్టి డబ్బులు తీసుకుని పారిపోయారని బాధితులు వాపోతున్నారు. దాదాపు 500 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసి సుమారు 7 వేల మంది కొనుగోలుదారులను మోసం చేశారు. భూముల కొనుగోలుకు పెట్టుబడి పథకం ద్వారా అధిక వడ్డీ లాభం చూపి భారీ మోసానికి పాల్పడ్డారన్నారు.

Read also: Ananya Panday: నిషా కళ్ళతో కలవరపరుస్తున్న అనన్య పండే అందాలు …

డబ్బులు ఇస్తామని నమ్మించి తీసుకున్నారని తెలిపారు. లక్ష నుంచి కోటి రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిన వారు ఉన్నారని అన్నారు. కొన్ని నెలలు డబ్బులు బాగానే ఇచ్చారని తెలిపారు. గత నాలుగు నెలల నుండి వడ్డీ ఇవ్వడం లేదు, అసలు ఇవ్వడం లేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. అడిగేందుకు వస్తే.. ఆఫీస్ కి తాళం వేశారని వాపోయారు. అధిక వడ్డీ వస్తుందని అత్యాశకు పోయి డబ్బులు పెట్టడం మాదే తప్పు అని బాధితులు అన్నారు. మా డబ్బులు అడిగితే టీమ్ లీడర్లు మధ్యలో అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేవి.బిల్డర్స్ యానలు లక్ష్మీ నారాయణ, జ్యోతిలను కలువనీయడం లేదని అన్నారు. లక్ష్మీ నారాయణ, జ్యోతిలు దేశం విడిచిపెట్టిపోయే అవకాశాం ఉందని తెలిపారు. మా డబ్బులు మాకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read also: Hariah Rao: రైతులకు రూ.10వేలు ఇవ్వండి.. ప్రభుత్వానికి హరీష్‌ రావు డిమాండ్‌

ఉప్పల్ లో జెవి బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసి సుమారు 500 కోట్ల రూపాయల వసూలుకు పాల్పడ్డారని వాపోయారు. సుమారు 500 మంది ఏజెంట్ లను ఏర్పాటు చేసుకొని, 7000 మంది కొనుగోలు దారులను లక్ష్మీ నారాయణ, జ్యోతి దంపతులు మోసం చేసినట్లు బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భూమి కొనుగోలు కోసం పెట్టుబడి పథకం ద్వారా అధిక వడ్డీ లాభాన్ని చూపి భారీ మోసం చేశారని లబోదిబో మంటున్నారు. జనగామ ప్రాంత శివారులో తక్కువ రేట్ లలో భూములు తీసుకొని బై బ్యాక్ ఆఫర్ అని చెప్పి కొంతమందికి ఈ భూమిని గుంట లెక్కన ఫార్మ్ లాండ్ గా రిజిస్ట్రేషన్ చేసారు. కాని చాలా మంది కస్టమర్స్ కి అగ్రిమెంట్ మీదనే మినిమం లక్ష కట్టితే నెలకు 8000/- చొప్పున, 20 నెలలు 160000/- అని కొన్ని నెలలు ఇచ్చి అందరిని మోసం చేశారు. అయితే డబ్బులు పెట్టి , తప్పుడు అగ్రిమెంట్ తో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప్పల్ పోలీస్టేషన్ లో బాధితుల పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో వీరిపై పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు సమాచారం. దీనిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Bandi Sanjay: విద్యార్థులకు ఆ సినిమా చూపించండి.. సీఎం రేవంత్ కు బండి సంజయ్‌ లేఖ

Exit mobile version