Site icon NTV Telugu

Collector Shashanka: ప్రభుత్వ పాఠశాలలో చదువుకోనే కలెక్టర్ అయ్యాను..

Collector Shashanka

Collector Shashanka

Collector Shashanka:ప్రభుత్వ పాఠశాలలో చదువుకోనే జిల్లా కలెక్టర్ ను అయ్యాను అని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. చదువు మాత్రమే జీవితంలో గొప్ప మార్పు తెస్తుందన్నారు. ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు యూనిఫార్మ్స్ పాఠ్యపుస్తకాలు అందజేశారు. జీవితంలో చదువు మాత్రమే మనిషికి గొప్ప మార్పు తెస్తుందన్నారు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్య గురించి గొప్పగా వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందజేశారు. లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాలయాలకంటే.. ప్రభుత్వ పాఠశాలలోనే మంచి బోధన లభిస్తుందన్నారు.

Read also: Rangareddy: రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ .. రంగారెడ్డిలో 46 బస్సులపై కేసు నమోదు

అన్ని రకాల వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వలు అందిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు చాలా మంది తల్లిదండ్రులు చులకనగా చూస్తారని, డబ్బులు పెట్టినంత మాత్రాన కార్పొరేట్ విద్య మంచిదని గుడ్డి నమ్మకంలో వున్నారన్నారు. కార్పొరేట్ విద్య కన్నా ప్రభుత్వం విద్యలో రానించిన వారు చాలా మంది వున్నారన్నారు. ప్రతి విద్యార్ధి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత పదవులు చేరాలని ఆశిస్తున్నా అన్నారు. ఇంత గొప్ప స్థాయికి ఎదగాను అంటే అది కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే అని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో పిలల్లను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశిందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
TG TET-DSC: టెట్, డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.. ఉచితంగా దరఖాస్తులు చేసుకోండి..

Exit mobile version