NTV Telugu Site icon

శంషాబాద్‌లో దారుణం : ఆ పని చేశారని.. స్తంభానికి కట్టేసి గుండుకొట్టారు..

శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బ్యాటరీలను దొంగతనం చేసారంటూ ఇద్దరు యువకులను కరెంటు స్తంభానికు కట్టివేసి గుండు కొట్టించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. జరిగిన అవమానంతో బాధితులు స్థానిక ఎయిర్‌పోర్ట్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ లోని అహ్మద్ నగర్ లో నివాసం ఉంటున్న మహమ్మద్ ఖుద్దూస్, ఎండి ఖాజాలు స్క్రాప్ బిజినెస్ చేస్తుంటారు. స్క్రాప్ బిజినెస్ తోపాటు చిన్న చిన్న దొంగతనాలు చేస్తారనే ఆరోపణలున్నాయి. కాగా గత కొంత కాలంగా అహ్మద్ నగర్ లో వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు దొంగతనానికి గురవుతున్నాయి.

అలా చోరీ కాబడిన బ్యాటరీలు అదే కాలనీలో ఉంటున్న ఎండి ఖాజా అనే యువకుడి ఇంటిలో దొరికాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖుద్దూస్ తో కలిసి ఖాజా బ్యాటరీలు దొంగిలించారనే కారణంతో అహ్మద్ కాలనీకి చెందిన కొంతమంది ఖుద్దూస్, ఖాజా లను బలవంతంగా స్థానిక మదీనా మసీదు సమీపంలోకి తీసుకొని వచ్చి అక్కడ కరెంటు స్తంభానికి కట్టివేసారు. ఖాజా ఇంటిలో దొరికిన బ్యాటరీలను ను ఖుద్దూస్, ఖాజాల మెడలో వేసి ఇద్దరికీ గుండు కొట్టించారు. జరిగిన అవమానంతో బాధితులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ అలీ, ఎండి జావేద్, ఎండి గౌస్, ఎండి భారీ ల పై కేసు నమోదు చేసుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.