NTV Telugu Site icon

Rangareddy: రంగారెడ్డి టీచర్ల బదిలీల్లో గందరగోళం.. రిటైర్డ్ అయిన టీచర్ కి పదోన్నతి..

Rangareddy Techers Tranfours

Rangareddy Techers Tranfours

Rangareddy: రంగారెడ్డి టీచర్ల బదిలీల్లో గందరగోళం పరిస్థితి నెలకుంది. రిటైర్డ్ అయిన టీచర్ కి పదోన్నతి రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫరూఖ్ నగర్ మండలం వెల్జర్ల లో మార్చిలో రవీంద్ర నాథ్ అనే ఉపాధ్యాయుడు పదివీ విరమణ చేశారు. అయితే.. రవీంద్ర నాథ్ అనే ఉపాధ్యాయుడికి విద్యాశాఖ అధికారులు కొందుర్గు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రవీంద్ర నాథ్ అనే ఉపాధ్యాయుడి పదివీ విరమణ చేసిన పదోన్నతి ఇవ్వడం ఏంటని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పదోన్నతిని కల్పిస్తూ ఉత్తర్వులు రావడంతో ఖంగు తిన్న రవీంద్రనాథ్ తనకు సంబంధం లేదంటూ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

Read also: Buffalo Solved Problem: బర్రె పంచాయితీని బర్రే.. తేల్చేసింది.. ఎలాగంటే?

ఇతర జిల్లాలకు చెందిన ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీ రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని, దీంతో ఈ జిల్లాలో ఉద్యోగాలు కోల్పోతున్నామని రంగారెడ్డికి చెందిన 40 మందికి పైగా ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే..సీనియారిటీ జాబితా లేకుండానే పదోన్నతులపై సవాల్ చేస్తూ రంగారెడ్డికి చెందిన ఉపాధ్యాయులు అప్పీలు చేశారు. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు డి.బాలకిషన్‌రావు. పదోన్నతులు, బదిలీలకు తాను వ్యతిరేకం కాదని, సీనియారిటీ జాబితాను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పీవీ కృష్ణయ్య వాదించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జూనియర్లు ఇక్కడికి రావడంతో తమ ప్రమోషన్ అవకాశాలు దెబ్బతింటున్నాయన్నారు. ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాకు వచ్చిన వారంతా జూనియర్లేనని ప్రతివాదుల తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్ రావు, ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. వాటి వల్ల ఎలాంటి నష్టం జరగలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బదిలీలు, పదోన్నతుల విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.
Falaknuma Express: వీల్ బ్రేక్ లాక్.. మిర్యాలగూడలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేత..

Show comments