Site icon NTV Telugu

Rangareddy Crime: రంగారెడ్డిలో దారుణం.. మూటలో మహిళ మృతదేహం..

Rangareddy Crime

Rangareddy Crime

Rangareddy Crime: ఓ మహిళ మృత దేహం మూటలో కట్టి రోడ్డుపై పడేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతుంది. ఉదయం తెల్లవారు జామున బయటకు వచ్చిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. కాలనీలో ఒక మూట కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస కాలనీకి చేరుకున్నారు. మూట ఉండటం చూసి క్లూటీంకు రప్పించారు. మూటను తీసి చూడగా పోలీసులు షాక్ కు గురయ్యారు. మూటలో ఓ మహిళ మృతదేహం ఉండటం, మహిళ ముక్కు, చెవులు కోసేసి బంగారు ఆభరణాలు చోరీ చేశారని గుర్తించారు. కమ్మలను తీసుకునేందుకు చెవులు కత్తిరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కడో హత్య చేసి, మూటలో కట్టి అర్థరాత్రి కాలనీలో పడేసి వెళ్లిన ఆనవాళ్ళు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులతో పాటు క్లూస్ టీమ్ ఆధారాలు కోసం ప్రయత్నిస్తున్నారు. మూటలో మహిళ మృత దేహం కనిపించడంతో శ్రీనివాస కాలనీలో భయాందోళన చెందుతున్నారు. మరోవైపు నల్లగొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కాళ్ళు చేతులు కట్టి పడేసి బండరాయితో మోది చంపిన ఆనవాళ్లు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Hassan Nasrallah: ఇజ్రాయెల్‌ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్‌ కుమార్తె మృతి..

Exit mobile version