Chevella Bus Tragedy: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీ కొనడంతో పెను విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 నెలల చిన్నారితో సహా తల్లి మృతి చెందింది. తల్లి పొత్తిళ్లలో హాయిగా పడుకున్న చిన్నారి యాక్సిడెంట్లో తల్లి చేతుల్లోనే ప్రాణాలను విడిచి పెట్టింది. తల్లీ బిడ్డ రోడ్డుపై విగత జీవులుగా పక్క పక్కనే పడి ఉన్న ఫొటో ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తుంది.
Read Also: Chevella Accident Causes: బస్సు ప్రమాదానికి 12 ప్రమాద కారణాలు ఇవే..!
కాగా, షాద్ నగర్ నుంచి కంకరతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి తాండూర్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉండగా.. చేవెళ్ల మండలం మీర్జాకూడా దగ్గర టర్నింగ్ పాయింట్ లో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 24 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుల్లో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ బృందాలు బస్సులోని వారు కంకరలో కూరుకుపోవడంతో వారిని బయటకు తీసి.. చేవెళ్ల, వికారాబాద్ ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడగా వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
