NTV Telugu Site icon

ATM Robbery: యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నం..

Stm

Stm

ATM Theft: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి గణేష్ నగర్ లో దొంగలు రెచ్చిపోయారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లోకి దుండగుడు చొరబడ్డారు. ఇనుప రాడుతో ఏటీఎం డోరు తెరిచే యత్నం. రెండు గంటల పాటు ఏటీఎం తెరవడానికి సకల ప్రయత్నాలు చేశారు. అతను ఎంత ప్రయత్నించిన ఏటీఎం తెరవడంలో విఫలం అయ్యాడు. చివరికి అలారం మోగడంతో దొంగ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. అయితే ఏటీఎం అలారంతో అలర్ట్‌ అయిన మైలార్‌ దేవ్‌ పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏటీఎంలో అంతా చల్లా చదురై ఉండటంతో షాక్‌ తిన్నారు. అర్థరాత్రి ఎవరు లేని ఏటీఎంలను దొంగలు టార్గెట్‌ చేస్తున్నారని తెలిపారు. దొంగ రాడ్డుతో ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నించాడని. అది తెరుచేకోలేకపోవడంతో చివరకు ఏటీఎంను పగులగొట్టే ప్రయత్నం చేశాడని గుర్తించారు. చివరకు ఏటీఎం అలారం మోగడంతో దొంగ ఇక్కడి నుంచి పారిపోయిన్నట్లు తెలిపారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దుండగుడిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read also: AP Crime: దారుణం.. రెండు రోజుల పాటు ఇంట్లో నిర్బంధించి మహిళపై అత్యాచారం

మరోవైపు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఖాజీపేటలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏటీఎం గదిలోని సీసీ కెమెరాలకు స్టిక్కర్లు అంటించి చోరీకి యత్నించారు. ఏటియమ్ మిషన్ ముందు భాగం తొలగించబడినప్పుడు అలారం మోగింది. అలారం మోగడంతో దుండగుడు పరారైనట్లు తెలుస్తోంది. బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే ఏటీఎం గదిని తనిఖీ చేశారు. నగదు చోరీకి గురికాలేదని తేల్చారు. దుండగుడు చోరీకి ప్రయత్నించిన ఏపీ39డీక్యూ7371 బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైక్ నంబర్, సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు.
Vinesh Phogat Retirement: వినేశ్‌ ఫొగాట్‌ షాకింగ్‌ నిర్ణయం.. నేను ఓడిపోయా అంటూ..!