NTV Telugu Site icon

Rangareddy Crime: దొంగతనం చేసిందనే అనుమానం.. మహిళను చితకబాదిన పోలీసులు

Rangareddy Crime

Rangareddy Crime

Rangareddy Crime: బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో అనుమానితులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు మహిళ అని చూడకుండా దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.

గత నెల 24 షాద్ నగర్ పట్టణం లోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతుల ఇంటి పక్కన నివాసం ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై దొంగతనం చేశారని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, భీమయ్య తో పాటు వారి 13 ఏళ్ళ కుమారుడు జగదీష్ నీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారు. మైనర్ బాలుడు జగదీష్ ను కూడా చిత్రహింసల గురి చేశారు పోలీసులు. డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి అతని సిబ్బంది బాధితురాలు సునీత ను కుమారుడి ముందే విచక్షణ రహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సీఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయానని తెలిపింది. దీంతో ఇంటికి పంపించారని బాధితురాలు వాపోతోంది. 24 తులాల బంగారం, 2 లక్షల నగదుకు గానూ కేవలం ఒక తులం బంగారం, నాలుగు వేల నగదు రికవరీ చేశామని పోలీసులు చెబుతున్నారు. మహిళ పై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా రిమాండ్ చెయకపోవడం గమనార్హం. అంతే కాకుండా.. ఇంటికి పంపించి వేయడం.. వెనుక పోలీసులు కొట్టిన దెబ్బలకు మహిళ గాయపడటమే కారణంగా తెలుస్తుంది. ఒక వేళ నిజంగా దొంగతనం చేస్తే రిమాండ్ తరలించాలి గానీ.. ఒక పేద మహిళ పై విచక్షణ రహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Wayanad Landslides : చిద్రమైన ముఖాలు.. పాదాలను చూసి అంచనా వేయాల్సిన దుస్థితి.. వయనాడ్ విషాదం