NTV Telugu Site icon

Ramoji Rao Last rites: ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు..

Ramoji Chandrababu

Ramoji Chandrababu

Ramoji Rao Last rites: రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రామోజీ రావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. రామోజీరావు కుమారుడు కిరణ్‌ అంత్యక్రియలు నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు, రామోజీ గ్రూపు కంపెనీల ఉద్యోగులు, ప్రజలు రామోజీరావుకు వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. రామోజీని చంద్రబాబు పాడారు. రామోజీ అంత్యక్రియలను ఆయన కుటుంబ సభ్యులు పూర్ణ లాంఛనాలతో నిర్వహించారు. రామోజీ అంతిమ యాత్రలో పాల్గొన్న చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. రామోజీని పాడి చంద్రబాబు తన గౌరవాన్ని చాటుకున్నారు.

Read also: Modi’s swearing-in: మోడీ ప్రమాణస్వీకారానికి ప్రత్యేక వంటకాలతో సందడి ఎన్ని ఐటమ్స్ అంటే..?

రామోజీ మరణానంతరం పలువురు సినీ ప్రముఖులు ఫిల్మ్ సిటీకి వచ్చి రామోజీకి నివాళులర్పించారు. రామోజీ సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. కుటుంబ సభ్యులు చివరి సారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రామోజీరావు స్మారక చిహ్నాన్ని సిద్ధం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని సువిశాల ప్రాంతంలో ఆయన నిర్మించిన స్మారకం వద్ద అంత్యక్రియలు జరిగాయి. కాగా, రామోజీ మృతికి ఏపీ ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పలువురు వారిని ఓదార్చడం కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రామోజీ అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం ఢిల్లీలో జరిగే మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరుకానున్నారు.
Manamey : మొదటి రోజు కంటే భారీగా.. కలెక్షన్స్ లో దూసుకుపోతున్న ‘మనమే’..