ఎడతెరపి లేని వర్షాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరిఖని శివారు గోదావరి నది వంతెన వద్ద వరద నీటిలో సమ్మక్క సారలమ్మ గద్దెలు మునిగిపోయాయి. గోదావరి ఓడ్డున ఉన్న బోట్ వరద ప్రభావంతో రాజీవ్ రహదారి వద్దకు కొట్టుకువచ్చింది. నది సమీపంలోని ఇటుక బట్టీలలో పనిచేసే 20 కుటుంబాలు వరదరలో చిక్కుకోవడంతో మర బోట్ ల ద్వారా వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు. వరద నీటిలో గోదావరిఖని లారీ యార్డు కూడా మునిగిపోయింది. మేడిపల్లి, మల్కాపూర్ గ్రామాలకు వరద నీరు వరద నీరు చేరడంతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు.
గోదావరి నది వంతెన ఫిల్లర్ల వద్దకు భారీగా వరదనీటి ప్రవాహం చేరుకుంది. అలాగే సింగరేణి సంస్థ ఓసీపీ -4 లో పని స్థలంలో ఇద్దరు కార్మికులు చిక్కుకున్నారు. ఇక రక్షణ చర్యల్లో నిమగ్నయారు రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సింగరేణి రెస్క్యూ, భద్రత సిబ్బంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో అప్రమత్తం చేసారు పోలీసులు.
