Rakhi Pournami Celebrations: వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇంట్లో రాఖీ పండుగ సంబురాలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకొని సందడి చేశారు. మంత్రి హరీశ్ రావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని, రాష్ట్ర ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకునే రాఖీ పౌర్ణమిసోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రాఖీ పౌర్ణమిని అందరూ ఆనందోత్సాహాలతో సంతోషంగా జరుపుకోవాలని స్పీకర్ తెలిపారు. కాగా, రాఖీ పౌర్ణమి సందర్భంగా బాన్సువాడలోని తన నివాసంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి తన సోదరి దొడ్ల సత్యవతి రాఖీ కట్టారు.
నల్గొండ రెసిడెన్సీ లో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాఖీ పండుగ సంబరాలు.. తమ అభిమాన నాయకునికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన మహిళనేతలు.
రక్షాబంధన్ సందర్భంగా మంత్రి తలసానికి రాఖీ కట్టిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రి సోదరీమణులు
రాఖీ పండుగను పురస్కరించుకుని మంత్రి జగదీష్ రెడ్డికి రాఖీ కట్టిన సోదరి, కట్టా రేణుక
