NTV Telugu Site icon

CM KCR: నేడు తుది దశకు రాజశ్యామల యాగం.. పూర్ణాహుతితో ముగింపు

Raja Syamala Yagam

Raja Syamala Yagam

CM KCR: సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న రాజ శ్యామలా యాగం తుది దశకు చేరుకుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ రాజ శ్యామలా యాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల నుంచి సీఎం కేసీఆర్ దంపతులు ఈ యాగం చేస్తున్నారు. అయితే ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో జరుగుతున్న ఈ రాజ శ్యామలా యాగం వీటితో పూర్తి కానుంది. మూడోరోజు నిర్వహించే పూజ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు. పూర్ణాహుతితో రాజా శ్యామలా యాగం ముగియనుంది. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, భారత రాష్ట్ర సమితి పార్టీ మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ యాగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ యాగం పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరో 3 ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ముందుగా నిర్మల్ జిల్లా బైంసా, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు వెళ్లి నేరుగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.

తెలుగు రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక యాగం చేపట్టిన విషయం తెలిసిందే.. దీనికి రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం అని పేరు పెట్టారు. ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో మూడు రోజుల పాటు ఈ యాగం జరగింది. ఈ రాజశ్యామల యాగ దీక్ష బుధవారం విశాఖ శ్రీ శారద అధ్యక్షులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆధ్వర్యంలో జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన పండితుల ఆధ్వర్యంలో ఇవాళ రాజ శ్యామలా యాగం చివరి దశకు చేరుకుంది. గోపూజ అనంతరం కేసీఆర్ దంపతులు యాగశాలలోకి అడుగుపెట్టారు. గణపతి పూజ, పుణ్యహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగాన్ని ప్రారంభించారు. విశాఖ శ్రీ శారదాపీఠం పీఠాధిపతి రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
TTD: వైకుంఠ ద్వార దర్శనం షెడ్యూల్‌ విడుదల.. టికెట్లు విడుదల ఎప్పుడంటే..?