Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఐటీయూ నాయకులు ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశ వర్కర్లు ముందు ధర్నా చేపట్టారు. సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇస్తున్న పారితోషకాలను రూ.18వేలు పెంచి, ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని అన్నారు. పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: KP Vivekanand: ఆధారాలు లేకున్నా హరీష్ రావుపై కేసు నమోదు చేస్తారా?
ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తున్నామన్నారు. ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనంతో ఆశా వర్కర్లు పని చేశారని అన్నారు. ఆశా వర్కర్లకు వేతనం పెంచడం పై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే హామీలు నెరవేర్చకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Ponnam Prabhakar: తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ కొత్త బస్సు డిపోలు..