Komatireddy Raj Gopal Reddy: నేను తప్పుచేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు వుంటే మీడియా ముందు తీసుకురండని సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లా మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన ఎన్టీవీతో మాట్లాడారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ లలో బీజేపీ పార్టీ బలం పెరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల విశ్వాసం కోల్పోయిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. 12 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే పార్టీ మారారో అప్పుడే ప్రజల విశ్వాసం కోల్పోయిందని సంచళన వ్యాఖ్యాలు చేశారు. రేవంత్ రెడ్డి చిల్లరగాడు.. అతని గురించి మాట్లాడదలుచుకోలేదు అని మండిపడ్డారు. అతనొక బ్లాక్ మైనర్ నాగురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Newyork: అగ్రరాజ్యంలో అత్యవసర పరిస్థితి.. సాయం కోరుతున్న పెద్దన్న
ప్రజలు మోడీ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. అవినీతిత పాలన కుటుంబ పాలన పోవాలంటే ఇది బీజేపీతోనే సాధ్యమని ఇప్పుడు మునుగోడు ఎన్నిక రావడం జరిగిందని అన్నారు. ఇది ఒక వ్యక్తికోసమో, ఎమ్మెల్యే పదివి కోసమో వచ్చిన ఎన్నిక కాదుని అన్నారు. మునుగోడులో వచ్చే తీర్పుతోనే తెలంగాణలో మార్పు వస్తుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. తప్పకుండా ఈ ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు ధర్మం వైపు వుంటారని ఒక చరిత్రలో మిగిలిపోయే తీర్పు ఇస్తారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించిన ఎన్నిక అని, తెలంగాణ ప్రజల తలరాతను మార్చే ఎన్నిక కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరూ నడుం బిగించాలని అన్నారు. కుటుంబ పాలన చేసుకుంటూ దోచుకుంటున్న కుటుంబానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసి తెలంగాణాని కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పించాలని తెలంగాణ ప్రజలందరికి కోరుకుంటున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Komatireddy Raj Gopal Reddy Munugode: సంచలన వ్యాఖ్యలు.. ఉద్యమానికి సీఎం కేసీఆర్‌కు కోట్లు ఇచ్చాం