NTV Telugu Site icon

DRDO Director : డీఆర్‌డీవో ఎంఎస్‌ఎస్‌ డీజీగా రాజబాబు

Figgi Raju

Figgi Raju

DRDO Director : డీఆర్‌డీవో ఎంఎస్‌ఎస్‌ కొత్త డైరక్టర్‌ జనరల్‌గా ప్రముఖ శాస్ర్తవేత్త అయిన ఉమ్మలనేని రాజబాబు నియమితులయ్యారు. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లో మిసైల్స్ అండ్‌ స్ట్రటజిక్‌ సిస్టమ్స్‌(ఎంఎస్‌ఎస్‌) డైరక్టర్‌ జనరల్‌గా రాజబాబును నియమించారు. ఇప్పటి వరకు డీఆర్‌డీఓ ఎంఎస్ఎస్‌ డీజీగా ఉన్న బీహెచ్‌వీఎస్‌ నారాయణ మూర్తి బుధవారం పదవీ విరమణ చేశారు. దీంతో డీఆర్‌డీఓలో ఆర్‌సీఐ విభాగం డైరెక్టర్‌గా కొనసాగుతున్న రాజబాబును ఆ స్థానంలో నియమించారు.

డీఆర్‌డీవో ఎంఎస్ఎస్‌ డీజీగా రాజబాబు నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన ఆయన 1988లో వైమానిక దళంలో తన కెరీర్‌ ప్రారంభించారు. అనంతరం 1995లో డీఆర్‌డీ వోలో చేరారు. 35 ఏళ్ల పాటు ప్రొఫెషనల్‌ ఏరోస్పెస్‌ కెరీర్‌లో విమానాలు, హెలికాప్టర్లతోపాటు అనేక క్షిపణి వ్యవస్థల అభివృద్ధిపై పనిచేశారు. ఆయన నాయకత్వంలో దేశంలోనే మొట్టమొదటి ఉపగ్రహ క్షిపణి పరీక్ష (ఎ-శాట్‌) మిషన్‌ శక్తిని విజయవంతం చేశారు. మిషన్‌ శక్తి ప్రదర్శనను విజయవంతంగా నడిపించినందుకు అత్యుత్తమ సాంకేతిక అభివృద్ధి అవార్డును ఆయనకు ప్రదానం చేశారు.
Astrology: జూన్‌ 1, గురువారం దినఫలాలు