ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతుదారులు హంగామా సృష్టించారు.హైదరాబాద్ నగరంలో గణేష్ చతుర్థి తొలి రోజు వేడుకల్లోనే ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, రాజాసింగ్ (Raja Singh) మద్దతుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. నిరసనకారులను అరెస్టు చేసి.. రాంగోపాల్ పేట్ ఠాణాకు తరలించారు.
Rajasingh Supporters: ఖైరతాబాద్ గణపతి వద్ద రాజాసింగ్ మద్దతుదారుల హంగామా

T Raja Singh1
