నైరుతీ గాలుల ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాగల 24 గంటల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు,మెరుపులతో కూడి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 24 గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
read also : స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై సస్పెన్షన్
ప్రధానంగా హైదరాబాద్ ఉత్తర భాగంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్, ఇల్లందు, బయ్యారం, భద్రాచలం ప్రాంతాల్లో 4సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల 1సెం.మీ నుంచి 3సెం.మీల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఇక, జూన్ 1 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో 30శాతం సాధారణ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా ఈ టైమ్‌లో 574మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు,వంకులు పొంగిపొర్లుతూ.. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరిం చుకున్నాయి. ఎగువ నుంచి వచ్చిన వరదతో ప్రధాన జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి.
