NTV Telugu Site icon

Intikanne Railway Track: ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ పనులు పూర్తి.. ట్రాక్ పై ట్రయల్ రన్

Intikanne Railway Track

Intikanne Railway Track

Intikanne Railway Track: మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ వరదనీటికి తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.. ఇంటికన్నె కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి చేశారు అధికారులు. వరద దాటికి రెండు రోజుల క్రితం ధ్వంసమైన రైల్వే ట్రాక్ ను.. 36 గంటల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైల్వే శాఖ రికార్డు సృష్టించింది. ఇంటికన్నె తాళ్ల పూసల పల్లి గార్ల దగ్గర జరిగిన డ్యామేజ్ మరమ్మత్తు కోసం సుమారు 1000 మంది సిబ్బంది పనులు చేపట్టారు. ఇంటికళ్ల దగ్గర 250 మంది పని చేస్తే, తాళ్ల పూసల పల్లి దగ్గర 200 మంది వర్కర్లు ట్రాక్ నీ మరమ్మత్తు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో 36 గంటల్లో ఇంటికన్నె కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి చేసి రైల్వే శాఖ అధికారులు రికార్డు సృష్టించారు. దీంతో సింగిల్ రైల్వే ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. కాగా.. అధికారులు ట్రాక్ పై ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ట్రయల్ రన్ పూర్తయితే క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం నుండి రెగ్యులర్ ట్రైన్స్ నడపడానికి రైల్వే అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

Read also: Hydra Commissioner: హైడ్రా పేరుతొ డబ్బు వసూళ్ల కు పాల్పడితే జైలుకే.. హైడ్రా కమిషనర్ వార్నింగ్..

మరోవైపు ఖమ్మం-వరంగల్ రూట్లో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశారు. సుమారు 20 ప్రాంతాల్లో పాక్షికంగా నాలుగు చోట్ల పెద్ద ఎత్తున ట్రాక్ దెబ్బతింది ఇంటికన్నె తాలపూసల పల్లి దగ్గర డామేజ్ ఎక్కువైంది. దీన్ని రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికల సిద్ధం చేశారు. పాక్షికంగా దెబ్బతిన్న దాన్ని 24 గంటల్లోనే మరమ్మతులు చేస్తే పెద్ద ఎత్తున ట్రాక్ కొట్టుకపోయిన ప్రాంతంలో మూడు రోజులపాటు వందలాదిమంది కార్మికులంతో శ్రమించి ట్రాక్ ను పునరుద్ధరించారు. ప్రస్తుతం మొదట గూడ్స్ ట్రైన్ ని టెస్టింగ్ ఇంకా నడిపి.. ఆ తర్వాత ఖాళీ ప్యాసింజర్ రైలు టెస్టింగ్ కోసం నడిపారు. మరో రెండు మూడు సార్లు టెస్టింగ్ ట్రైలర్ నడిపిన తర్వాత సాయంత్రానికి ఢిల్లీ రూట్లో నడిచే ఇంపార్టెంట్ ట్రైన్స్ ని అనుమతించే అవకాశం ఉంది.
Ganesh Chaturthi: వినాయకచవితి సందడి షురూ.. జనాలతో కిటకిటలాడుతున్న హైదరాబాద్​ మార్కెట్లు